గుంటూరు న్యూడ్ ఫోటోల కేసు.. ఇన్‌స్టాగ్రమ్ 420 దొరికాడు
గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కేసులో మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కౌశిక్‌లను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసిన యువకుడిని కూడా గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. “మై నేమ్ ఈజ్ 420’ అనే ఇన్‌స్ట్రాగామ్ ఐడీపై విద్యార్థిని న్యూడ్ ఫోటోలను అప్లోడ్ చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. విద్యార్థిని చదివిన కళాశాలలోనే చదివిన విద్యార్థికి ఈ వీడియోలు, న్యూడ్ ఫోటోలు అందాయి.
అయితే ఇవి ఎక్కడ నుంచి అతడికి వచ్చాయనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వీడియోలు సంపాదించిన విద్యార్థి వాటిని ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేయటంతో పాటు మరో నలుగురికి పంపినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే డెల్టా ప్రాంతానికి చెందిన విద్యార్థితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వీడియో తీసుకున్న విద్యార్థి సదురు విద్యార్థినిని బెదిరించి డబ్బులు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
Read:మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు…వైసీపీ నేత హత్య కేసులో ఆయనపై అభియోగాలు