Glenn Maxwell : ఆర్‌సీబీ అభిమానుల‌కు షాక్‌.. మాక్స్‌వెల్‌కు గాయం.. ఐపీఎల్ 2024 ఆడేది అనుమానం..?

Glenn Maxwell Injury : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్ ఇది. భీక‌ర ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ గాయ‌ప‌డ్డాడు.

Glenn Maxwell : ఆర్‌సీబీ అభిమానుల‌కు షాక్‌.. మాక్స్‌వెల్‌కు గాయం.. ఐపీఎల్ 2024 ఆడేది అనుమానం..?

Glenn Maxwell Injury

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్ ఇది. భీక‌ర ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ గాయ‌ప‌డ్డాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌)లో ఆడుతున్న మాక్స్‌వెల్ చేతికి గాయ‌మైంది. గురువారం బిగ్‌బాష్ లీగ్ 13వ సీజ‌న్ ప్రారంభమైంది. మొద‌టి మ్యాచులో మెల్‌బోర్న్ స్టార్స్‌, బ్రిస్బేన్ హీట్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. మెల్‌బోర్న్ స్టార్స్ త‌రుపున మాక్స్‌వెల్ ఆడాడు. అయితే.. ఈ మ్యాచులో అత‌డి మో చేతికి గాయ‌మైంది.

దీంతో త‌దుప‌రి మ్యాచుల్లో ఆడ‌డం లేద‌ని మాక్స్‌వెల్‌ మెల్‌బోర్న్ స్టార్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. బుధ‌వారం పెర్త్ స్కాచ‌ర్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచులోనూ అత‌డు ఆడ‌డ‌ని పేర్కొంది. అత‌డి గాయం పై మ‌రిన్ని అప్‌డేట్‌ల‌ను త్వ‌ర‌లోనే అంద‌జేయ‌నున్న‌ట్లు ఎక్స్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ పోస్ట్ చేసింది. ఈ విష‌యం తెలిసిన మాక్సీ అభిమానుల‌తో పాటు బెంగ‌ళూరు అభిమానులు అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. గాయం తీవ్ర‌త గ‌నుక పెద్ద‌ది అయితే అత‌డు ఐపీఎల్ కూడా ఆడే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయి.

MS Dhoni : 20 కిలోల బ‌రువు త‌గ్గితే ఐపీఎల్‌లో తీసుకుంటాన‌న్న ధోని.. కానీ అతడు మాత్రం..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కొలిన్ మ‌న్రో 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 99 ప‌రుగుల‌తో చేశాడు. ఒక్క ప‌రుగు తేడాతో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. ల‌బుషేన్ 30, ఉస్మాన్ ఖావాజా 28 ప‌రుగుల‌తో రాణించారు. మెల్ బోర్న్ స్టార్స్ బౌలర్లలో జోయెల్, కౌల్టర్ నైల్ , మాక్స్‌వెల్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో మెల్‌బోర్న్ స్టార్స్ 15.1 ఓవ‌ర్ల‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. హిల్టన్ కార్ట్‌రైట్ (33), మాక్స్‌వెల్ (23; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించిన మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 103 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌వి చూసింది.

అప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ ఆడ‌తా..

ఇటీవ‌ల మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వ‌ర‌కు ఐపీఎల్ ఆడుతాన‌ని చెప్పాడు. ఇక తాను న‌డ‌వ‌లేను అనే వ‌ర‌కు ఆడ‌తాన‌ని అన్నాడు. త‌న కెరీర్‌లో ఐపీఎలే చివ‌రి టోర్నీ అవుతుంద‌ని తెలిపాడు. ఐపీఎల్ త‌న కెరీర్‌కు ఎంతో సాయం చేసింద‌న్నాడు. ఆట‌గాళ్లు, కోచ్‌ల నుంచి ఎంతో నేర్చుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియ‌ర్స్ వంటి ఆట‌గాళ్ల‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను త‌న జీవితంలో మ‌రిచిపోలేన‌ని చెప్పుకొచ్చాడు. 2021 సీజ‌న్ నుంచి ఆర్‌సీబీ జ‌ట్టుతో మాక్స్‌వెల్ కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు అత‌డికి రూ.14.25 కోట్లు చెల్లిస్తోంది. గ‌త సీజ‌న్‌లో అత‌డు 183.49 స్ట్రైక్‌రేటుతో 400 ప‌రుగులు చేశాడు.

Sreesanth : చిక్కుల్లో టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ శ్రీశాంత్‌.. లీగ‌ల్ నోటీసులు పంపిన ఎల్ఎల్‌సీ