INDW vs UAEW: మహిళల టీ-20లో తొలిసారి 200 పరుగులు దాటిన టీమిండియా స్కోరు.. యూఏఈపై విజయం

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిచా ఘోష్‌కు దక్కింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్‌ 66, రిచా 64 (నాటౌట్)..

INDW vs UAEW: మహిళల టీ-20లో తొలిసారి 200 పరుగులు దాటిన టీమిండియా స్కోరు.. యూఏఈపై విజయం

Pic Credit: @BCCIWomen

Updated On : July 21, 2024 / 8:59 PM IST

మహిళల టీ-20లో టీమిండియా స్కోరు తొలిసారి 200 పరుగులు దాటింది. మహిళల ఆసియా కప్‌ టీ20లో ఇవాళ టీమిండియా-యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. 78 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

టాస్‌ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 201/5 స్కోరు చేసింది. భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన యూఏఈ ఏ మాత్రం రాణించలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.

ఈషా 38, కవిషా 40 (నాటౌట్), తీర్థ సతీశ్ 4, రినిత 7, సమైరా 5, ఖుషీ 10, హీనా 8 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో దీప్తి 2 వికెట్లు తీయగా, రేణుక, తనుజా, పుజా, రాధా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్‌ 66, రిచా 64 (నాటౌట్), షఫాలీ వర్మ 37, స్మృతి మంధాన 13, జెమీమా 14 పరుగులు చేశారు. యూఏఈ మహిళ జట్టు బౌలర్లలో కవిషా 2 వికెట్లు తీయగా, సమైరా, హీనాకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిచా ఘోష్‌కు దక్కింది.

Also Read: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్‌.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా రిష‌బ్ పంత్..! కేఎల్ రాహుల్ పయనం ఎటంటే?