Poco C65 Launch : అదిరే ఫీచర్లతో పోకో C65 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Poco C65 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే డిసెంబర్ 15 వరకు ఆగండి.. పోకో నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. పూర్తి వివరాలు మీకోసం..

Poco C65 Launch : అదిరే ఫీచర్లతో పోకో C65 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Poco C65 to launch in India on December 15_ Expected price and more

Poco C65 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో కొత్త సరసమైన C-సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే భారత మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధంగా ఉంది. కొత్తగా పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ పోకో ‘ది బిగ్ డీల్’గా క్యాంపియన్ నిర్వహించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 13సి రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. షావోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మి గతవారమే భారత మార్కెట్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది.

Read Also : Redmi 13C vs Redmi 12C : రెడ్‌మి 13సి లేదా రెడ్‌మి 12సి ఫోన్లలో ఏది కొంటే బెటర్? ధర, ఫీచర్ల వివరాలివే..!

మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్, 50ఎంపీ ఏఐ కెమెరాతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌గా పోకో సి65 ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. అయితే, భారతీయ వేరియంట్ ఎలాంటి స్పెషిఫికేషన్లను కలిగి ఉంటుందో లేదో కంపెనీ ధృవీకరించలేదు. ఈ మోడల్ 256జీబీ స్టోరేజ్‌తో మొదటి 8జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్ కావచ్చు.

Poco C65 to launch in India on December 15_ Expected price and more

Poco C65 to launch in India

రాబోయే పోకో సి65 ఫిబ్రవరిలో లాంచ్ చేసిన పోకో సి55 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇతర పోకో స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే.. రాబోయే స్మార్ట్‌ఫోన్ కూడా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ సైతం ఇదే డిజైన్‌ను పోకో C65 టీజర్ పోస్టర్‌లో షేర్ చేసింది. పోకో పర్పుల్ కలర్‌లో స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ఈ ఫోన్ కోసం మరో బ్లాక్, బ్లూ రెండు కలర్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ మోడల్ డిజైన్ కూడా గ్లోబల్ వేరియంట్‌ని పోలి ఉంటుంది.

పోకో సి65 ధర, స్పెషిఫికేషన్లు :
పోకో సి65 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 12వేల లోపు ఉండవచ్చు. 90హెచ్‌జెడ్ 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఏఆర్ఎమ్ మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ, 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో కూడిన మీడియాటెక్ హెలియో జీ85 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌తో స్మార్ట్‌ఫోన్ అందించనుంది. కెమెరా విషయానిక వస్తే.. పోకో సి65 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ 2ఎంపీ మాక్రో లెన్స్‌ను కలిగి ఉండవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం సెంటర్-అలైన్డ్ వాటర్ డ్రాప్ నాచ్‌లో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉండవచ్చు. పోకో సి65 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కూడా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పోకో అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14ని కూడా రన్ అవుతుందని భావిస్తున్నారు.

Read Also : Redmi 13C Sale Today : రెడ్‌మి 13సి ఫోన్ సేల్ మొదలైంది.. ఎక్కడ కొనాలి? లాంచ్ ఆఫర్ల వివరాలివే..!