Google Pixel 9 Series : గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ వచ్చేస్తోంది.. ఆగస్టు 13న గ్లోబల్ లాంచ్.. కలర్ వేరియంట్లు, ధర పూర్తి వివరాలు లీక్..!

Google Pixel 9 Series : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అయితే, రియల్ గూగుల్ పద్ధతిలో అన్ని కొత్త పిక్సెల్ ఫోన్లలో ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వచ్చే ఆగస్టు 13న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్నాయి.

Google Pixel 9 Series : గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ వచ్చేస్తోంది.. ఆగస్టు 13న గ్లోబల్ లాంచ్.. కలర్ వేరియంట్లు, ధర పూర్తి వివరాలు లీక్..!

Pixel 9 series, Pixel 9 Pro Fold full price and colour variants leak ( Image Source : Google )

Google Pixel 9 Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి సరికొత్త పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్లు రానున్నాయి. వచ్చే ఆగస్టు 13న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్నాయి. అయితే, లాంచ్ డేట్‌కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. గూగుల్ వార్షిక మేడ్ బై గూగుల్ ఈవెంట్‌ను త్వరలో నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.

Read Also : Poco M6 Plus 5G Launch : పోకో M6 ప్లస్ 5జీ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఈ ఈవెంట్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 9 లైనప్‌ను వనిల్లా వేరియంట్, పిక్సెల్ 9ప్రో, పిక్సెల్ 9ప్రో ఎక్స్ఎల్ సహా లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అయితే, రియల్ గూగుల్ పద్ధతిలో అన్ని కొత్త పిక్సెల్ ఫోన్లలో ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఫ్రెంచ్ పబ్లికేషన్ డీలాబ్స్ నివేదిక ప్రకారం.. పిక్సెల్ 9 సిరీస్ అబ్సిడియన్ (బ్లాక్), (వైట్), కాస్మో, మోజిటో అనే 4 కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లీకైన ధరలు :
లీక్ ప్రకారం.. వనిలా వేరియంట్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 899 యూరోలు, 256GB స్టోరేజ్ వేరియంట్  999 యూరోలు ఉంటుంది. అదే సమయంలో, పిక్సెల్ 9ప్రో ధర 128జీబీ వేరియంట్‌కు 1,099 యూరోలు, 256జీబీ వేరియంట్‌కు  1,199 యూరోలు, 512జీబీ వేరియంట్‌కు 1,329 యూరోలు ఉండనుంది.

అదే సమయంలో, పిక్సెల్ 9ప్రో ఎక్స్ఎల్ ధర 128జీబీ స్ట్రారేజ్ వేరియంట్‌కు 1,199 యూరోలు, 256జీబీ వెర్షన్‌కు 1,299 యూరోలు, 512జీబీ వేరియంట్‌కు 1,429 యూరోలు, టాప్ ఎండ్ వేరియంట్  1,689 యూరోలు ఉండనుంది. పిక్సెల్ 9ప్రో ఎక్స్ఎల్ టాప్ ఎండ్ వేరియంట్ ఒబిడియన్ కలర్ ఆప్టాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, 128జీబీ, 512జీబీ మోడల్‌లు హాజెల్ ఫినిషింగ్‌లలో వస్తాయి.

256జీబీ వేరియంట్ మాత్రమే పింక్ రంగులో ఉండనుంది. చివరగా, గత ఏడాదిలో పిక్సెల్ ఫోల్డ్‌కు సక్సెసర్ అయిన పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, 256జీబీ, 512జీబీ వేరియంట్‌ల కోసం వరుసగా  1,899 యూరోలు,  2,029 యూరోలు ధరలో ఉండవచ్చు. అబ్సిడియన్ మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ యూరోపియన్ ధరలు, పన్ను రేట్లను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండవచ్చని గమనించండి. అంతేకాకుండా, లీక్ అయిన ధరలు, పిక్సెల్ 9 సిరీస్‌కు సంబంధించి గూగుల్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Read Also : CMF Phone 1 First Sale : కొత్త సీఎమ్ఎఫ్ ఫోన్ 1 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?