Motorola Edge 50 Neo : అదిరే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 5o నియో ఫోన్.. మొత్తం 4 కలర్ ఆప్షన్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

టిప్‌స్టర్ సుధాన్షు లీక్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 నియో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది.

Motorola Edge 50 Neo : అదిరే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 5o నియో ఫోన్.. మొత్తం 4 కలర్ ఆప్షన్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Motorola Edge 50 Neo tipped to come with up to 512GB storage ( Image Source : Google )

Motorola Edge 50 Neo Launch : ఈ ఏడాది ప్రారంభంలో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్5o ప్రో లాంచ్ తరువాత లెనోవో సబ్-బ్రాండ్ త్వరలో ఎడ్జ్ 50 నియోను లాంచ్ చేయాలని యోచిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 50 నియో లాంచ్‌ను కంపెనీ ధృవీకరించనప్పటికీ, లేటెస్ట్ లీక్ స్మార్ట్‌ఫోన్ కొన్ని ముఖ్య ఫీచర్లను సూచించింది.

Read Also : Moto G85 5G Launch : మోటో G85 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

టిప్‌స్టర్ సుధాన్షు లీక్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 నియో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గ్రే, బ్లూ, పోయిన్సియానా, మిల్క్ కలర్స్ 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ కలర్ వేరియంట్‌లలో కొన్ని పాంటోన్-సర్టిఫికేట్ పొందే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

మోటోరోలా ఎడ్జ్ 40 నియో :
మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్పెషిఫికేషన్లు, ధరను పరిశీలిస్తే.. మోటరోలా నియో మోటోరోలా ఎడ్జ్ 40నియో 144Hz రిఫ్రెష్ రేట్, 1300నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.55-అంగుళాల పీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. నీటి నిరోధకతకు ఐపీ68-రేట్ అయింది. మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ 6879 డైమెన్సిటీ 7030 ఎస్ఓసీపై 6 నానోమీటర్ల ప్రక్రియ ఆధారంగా రన్ అవుతుంది. గ్రాఫిక్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు మాలి-జీ610 ఎంసీ3 జీపీయూతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటోరోలా మిడ్-రేంజర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), సెకండరీ 13ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌కు సపోర్టుతో 50ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 32ఎంపీ కెమెరా కలిగి ఉంది. అన్ని సెల్ఫీ, వీడియో కాల్ చేసుకోవచ్చు. ఎడ్జ్ 50 నియో 8జీబీ/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 23,999, 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999కు అందుబాటులో ఉంది.

Read Also : SpaceX Satellites Crash : స్పేస్ఎక్స్‌కు తీరని ఎదురుదెబ్బ.. భూమిపై కూలిపోనున్న 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు!