YCP MP Lavu Krishna Devarayalu : వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నరసరావుపేట ఎంపీ

నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

YCP MP Lavu Krishna Devarayalu : వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నరసరావుపేట ఎంపీ

Lavu Krishna Devarayalu

AP Politics: నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన నిర్ణయం ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారని, గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్లమెంట్ కు పంపించారని అన్నారు. గడిచిన నాలుగున్నారేళ్లలో నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషిచేశానని చెప్పారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి నేను బాధ్యుడిని కాదని శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం కొత్త అభ్యర్థిని నిలబెట్టాని ఆలోచిస్తోందని తెలిసిందని,  కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Also Read : YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల ఫోకస్.. నేటి నుంచి జిల్లాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే

పార్టీ మార్పుపై కొద్దిరోజులుగా ప్రచారం..
శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీని వీడుతున్నట్లు కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ తో దేవరాయలు టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గత బుధవారం శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చంద్రబాబు దేవరాయలుకు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో గత నాలుగు రోజులుగా స్థానికంగా ఆయన అభిమానులతో దేవరాయులు చర్చలు జరిపిన అనంతరం వైసీపీకి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే, టీడీపీలో చేరుతున్న విషయంపై శ్రీకృష్ణ దేవరాయలు క్లారిటీ ఇవ్వలేదు.

Also Read : AP Anganwadi Workers : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల తొలగింపును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

వైసీపీని వీడిన మరో ఎంపీ..
వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో పలువురిని తప్పించి ఆ నియోజకవర్గాల్లో ఇంచార్జులను నియమిస్తోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడుతున్నారు. ఇప్పటికే కర్నూల్ ఎంపీ, మచిలీపట్నం ఎంపీలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుసైతం వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
నరసరావుపేట ఎంపీ స్థానంపైనే లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్యేలుసైతం దేవరాయలే మరోసారి ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే, అధిష్టానం మాత్రం దేవరాయలును నరసరావుపేట ఎంపీగా మరోసారి బరిలోకి దింపేందుకు ఆసక్తిచూపడం లేదని సమాచారం. దీంతో కొంతకాలంగా అధిష్టానం తీరుపై లావు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా వైసీపీ సభ్యత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.