Breeding Management : ఫ్యాషన్‌తో మేలుజాతి పశువుల పెంపకం..

Breeding Management : మేలు జాతి ఆవులకు పుట్టినిల్లు భారత దేశమే. వాణిజ్య వ్యవసాయ విస్తరణతో ఆహార ధాన్యాల పంటలను, పశువుల పెంపకాన్ని కలిసి నిర్వహించే సంప్రదాయక వ్యవసాయం అంతరించింది.

Breeding Management : ఫ్యాషన్‌తో మేలుజాతి పశువుల పెంపకం..

Local Breed of Cattle Farming

Breeding Management : దేశవాళీ పశు జాతులు అంతరించేదశకు చేరుకుంటున్నాయి. వీటి పెంపకం  ఖర్చుతో కూడుకున్నది కావడంతో చిన్నరైతులు.. ఇప్పటికే వీటికి దూరమయ్యారు. ఈక్రమంలో కొందరు పెద్దరైతులు మాత్రం.. వీటిపై మక్కువతో సాకుతున్నారు. ఈకోవలోనే తూర్పుగోదావరి   జిల్లాకు చెందిన ఓ రైతు.. దేశవాళీ ఆవులపై మక్కువతో, వాటిని పెంచుతున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వెళ్తున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

మేలు జాతి ఆవులకు పుట్టినిల్లు భారత దేశమే. వాణిజ్య వ్యవసాయ విస్తరణతో ఆహార ధాన్యాల పంటలను, పశువుల పెంపకాన్ని కలిసి నిర్వహించే సంప్రదాయక వ్యవసాయం అంతరించింది. ఫలితంగా వ్యవసాయంతో పెనవేసుకున్న అనుబంధ వృత్తిగా పశుపోషణ కూడా క్షీణించింది.

ఆధునిక డైరీ ఫామ్ కల్చర్ విస్తరణ, దేశవాళీ ఆవులు తదితర పశు జాతులకు మరణ శాసనంగా మారుతోంది. ఈ నేపధ్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండానే కేవలం మేలు జాతి దేశీఆవుల సంరక్షణ చేపట్టాడు తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం, కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన రైతు కందుల గణపతి. వీటికోసం ప్రత్యేకంగా పశుగ్రాసం పెంచుతున్నారు. అంతేకాదు.. వేసవితాపం నుండి వీటిని కాపాడేందుకు ఒక గేదెల స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించారు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు