నన్ను సజీవంగా పూడ్చిపెట్టారు.. వీధి కుక్కలు మట్టిని తొవ్వి ప్రాణాలు కాపాడాయి: ఆగ్రా యువకుడు

రూప్ కిశోర్ మృతి చెందాడని భావించి నిందితులు ఓ పొలంలో అతడిని పాతిపెట్టి వెళ్లిపోయారు.

నన్ను సజీవంగా పూడ్చిపెట్టారు.. వీధి కుక్కలు మట్టిని తొవ్వి ప్రాణాలు కాపాడాయి: ఆగ్రా యువకుడు

భూ వివాదంలో నలుగురు వ్యక్తులు తనను సజీవంగా పూడ్చిపెట్టారని, అనంతరం వీధికుక్కలు మట్టిని తొవ్వడంతో తాను బతికి బయటపడ్డానని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 18న ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో అతడిపై అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే నలుగురు యువకులు కత్తులతో దాడి చేశారు. రూప్ కిశోర్ మృతి చెందాడని భావించి నిందితులు ఓ పొలంలో అతడిని పాతిపెట్టి వెళ్లిపోయారు.

అదే సమయంలో అక్కడకు వచ్చిన కొన్ని వీధి కుక్కలు అక్కడ మట్టి తొవ్వాయి. రూప్ కిశోర్‌ శరీరాన్ని కొరికాయి. దీంతో రూప్ కిశోర్‌కి తిరిగి స్పృహ వచ్చింది. దీంతో అతడు నడుచుకుంటూ స్థానికుల వద్దకు వెళ్లడంలో అతడిని వారు ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై రూప్ కిశోర్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడిని నలుగురు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని అన్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: హమాస్‌ మాస్టర్‌మైండ్ డెయిఫ్‌ హతం.. వరుసపెట్టి హమాస్ లీడర్లను ఖతం చేస్తున్న ఇజ్రాయెల్