Redmi A3 Launch : అద్భుతమైన కెమెరాలతో రెడ్‌మి A3 ఫోన్ వచ్చేస్తోంది.. వాలెంటైన్స్ డే రోజునే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi A3 Launch : ఈ ఏడాదిలో ప్రేమికుల రోజున రెడ్‌మి A3 ఫోన్ లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే కీలక స్పెషిఫికేషన్లు రివీల్ అయ్యాయి. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Redmi A3 Launch : అద్భుతమైన కెమెరాలతో రెడ్‌మి A3 ఫోన్ వచ్చేస్తోంది.. వాలెంటైన్స్ డే రోజునే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi A3 Confirmed to Launch in India on February 14

Redmi A3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి సరికొత్త రెడ్‌మి A3 ఫోన్ వచ్చేసింది. ఈ నెల (ఫిబ్రవరి 14న) భారత మార్కెట్లో లాంచ్ కానుందని నివేదిక ధృవీకరించింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ కోసం కొత్త ల్యాండింగ్ పేజీని కూడా క్రియేట్ చేసింది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్‌లను కూడా షేర్ చేసింది.

Read Also : Valentines Day Deals 2024 : వాలెంటైన్స్ డీల్స్.. మీకు ఇష్టమైనవారి కోసం టాప్ 5 టెక్ గాడ్జెట్లు ఇవే.. మీకు నచ్చింది గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు..!

రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే, 6జీబీ వర్చువల్ ర్యామ్‌కి సపోర్టుతో 6జీబీ ర్యామ్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు నిర్ధారించింది. దాంతో కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ కోసం హాలో డిజైన్‌ను కూడా టీజ్ చేసింది. డ్యూయల్ కెమెరా సెటప్‌తో వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను అందించనుంది.

హాలో డిజైన్‌ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ :
రెడ్‌మి A3 ల్యాండింగ్ పేజీ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. డిజైన్ పరంగా పరిశీలిస్తే.. స్మార్ట్‌ఫోన్ గత వెర్షన్ల మాదిరిగానే లెదర్ టెక్చర్డ్ బ్యాక్ ప్యానెల్‌ను అందించనుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హాలో డిజైన్‌ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను పొందవచ్చు. దిగువన కంపెనీ బ్రాండింగ్‌తో డిజైన్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను షేర్ చేసిన ఫొటోలలో కూడా చూడవచ్చు.

రెడ్‌మి ఎ3 ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను పొందుతుందని కంపెనీ వెల్లడించింది. రెడ్‌మి ఎ2లో 60హెచ్‌జెడ్ స్క్రీన్ నుంచి అందించనుంది. డిస్‌ప్లే ఇతర వివరాలు వెల్లడించలేదు. అదనంగా, ఈ హ్యాండ్‌సెట్ 6జీబీ ర్యామ్, 5,00ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఇతర ర్యామ్ లేదా ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌లు బహిర్గతం కాలేదు.

Redmi A3 Confirmed to Launch in India on February 14

Redmi A3 Launch India 

రెడ్‌మి ఎ3 కీలక స్పెషిఫికేషన్లు :
అయితే, ఈ హ్యాండ్‌సెట్ ఇతర కీలక స్పెసిఫికేషన్‌లు కూడా రివీల్ అయ్యాయి. ఇటీవల, రెడ్‌మి ఎ3 ఆఫ్రికన్ రిటైల్ అవుట్‌లెట్‌లలో కనిపించింది. ఈ జాబితా ప్రకారం.. కచ్చితమైన మోడల్ పేర్కొనబడనప్పటికీ.. రాబోయే స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌లో రన్ కావచ్చు. లిస్టింగ్ ద్వారా 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ కూడా అందించవచ్చు. ఇంకా, ఈ హ్యాండ్‌సెట్ 13ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. బ్యాటరీ యూనిట్ 10డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు వస్తుందని పుకారు ఉంది.

రెడ్‌మి ఎ3 ఫోన్ కలర్ ఆప్షన్లు (అంచనా) :
రెడ్‌మి ఎ3 ఫోన్ 6.71-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని నివేదిక సూచించింది. రెడ్‌మి గత వెర్షన్ ఫోన్ 6.52-అంగుళాల స్క్రీన్ కన్నా పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంది. 32జీబీ, 128జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉండనుంది. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా చౌకైన ధరకు పొందాలంటే?