Gold Rate : బంగారం కొనుగోలుదారులకు మంచి ఛాన్స్..! భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. 10గ్రాముల ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ,..
Gold Rate in Hyderabad : కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా బంగారం ధర దూసుకెళ్తుంది. గడిచిన పదకొండు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ. 2వేలు పెరిగింది. గత శనివారం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఆదివారం స్థిరంగా కొనసాగింది. తాజాగా సోమవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 550 తగ్గింది. దీంతో గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్లతో బెంబేలెత్తిపోతున్న బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించినట్లయింది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,550 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,690 వద్దకు చేరింది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,840.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,550 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,690.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,450 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.74,670.
- తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.89,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 89,000. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.85,500 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 86,000 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.