CM Revanth Reddy : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల చేరుకున్న సీఎం రేవంత్‌కు శ్రీ పద్మావతి అతిథి గృహాల వద్ద టీటీడీ రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికారు.

CM Revanth Reddy : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Arrives Tirumala Today

Updated On : May 21, 2024 / 9:24 PM IST

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శ్రీవారి దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి (మే 21) తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కుటుంబ సమేతంగా బయల్దేరిన ఆయన ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ తొలిసారిగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తిరుమల చేరుకున్న సీఎం రేవంత్‌కు శ్రీ పద్మావతి అతిథి గృహాల వద్ద టీటీడీ రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం బస కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు (మే 22) ఉదయం కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్‌‌కు రానున్నారు.

Read Also : అందుకోసమే.. చంద్రబాబు విదేశాలకు వెళ్లారు- మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు