ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంపై ఎందుకింత చర్చ? అమెరికా, ఇజ్రాయెల్‌పై అనుమానాలెందుకు?

రైసీ మరణవార్త విన్న వెంటనే అందరికీ అమెరికా, ఇజ్రాయల్ గుర్తు రావడానికి కారణం ఏంటి?

ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంపై ఎందుకింత చర్చ? అమెరికా, ఇజ్రాయెల్‌పై అనుమానాలెందుకు?

Updated On : May 21, 2024 / 9:40 PM IST

Iran President Ebrahim Raisi : ఇబ్రహిం రైసీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ మంచిగాను, చెడుగాను ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఇరాన్ అధ్యక్షుడి మరణం చుట్టూ ఎందుకింత చర్చ జరుగుతోంది. కాలం చెల్లిన హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ ఇబ్రహిం రైసీ దుర్మరణం చెందినప్పటికీ, ఇది సహజ ప్రమాదంగా ప్రపంచం ఎందుకు చూడటం లేదు?

రైసీకి.. టెహ్రాన్ కసాయి అనే పేరు ఎందుకు వచ్చింది?
నిజానికి హెలికాప్టర్ ప్రమాదంలో దేశాధ్యక్షుడు మరణించడంపై పెద్ద ఎత్తున సంతాపం వ్యక్తం కావాలి. దేశమంతా విషాదంలో మునిగిపోవాలి. రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా ప్రజలందరిని అధ్యక్షుడి మరణం కదిలించి వేయాలి. కానీ, ఇరాన్ లో అలా జరగటం లేదని, కొందరు ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారని సోషల్ మీడియా చెబుతోంది.

దీనికి కారణం రైసీ ఇరాన్ ను మతచాందసవాదంవైపు నడిపించడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసలు రైసీని.. టెహ్రాన్ కసాయిగా, డెత్ కమిషన్ గా ఎందుకు పిలిచారు? పౌర హక్కులను అణిచివేయటంలో రైసీ పాత్ర ఎంత? అసలు మతాధికారి నుంచి అధ్యక్షుడిగా రైసీ ఎలా ఎదిగారు? పదవీ కాలంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?

Also Read : ప్రమాదమా? కుట్రపూరిత హత్యా? ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంపై అనేక అనుమానాలు

పూర్తి వివరాలు..