Gold Rate : బాబోయ్.. రూ.లక్ష దాటిన కిలో వెండి ధర.. సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్న గోల్డ్ రేటు.. పూర్తి వివరాలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Rate : బాబోయ్.. రూ.లక్ష దాటిన కిలో వెండి ధర.. సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్న గోల్డ్ రేటు.. పూర్తి వివరాలు ఇలా..

Gold

Updated On : May 20, 2024 / 12:00 PM IST

Gold and Silver Rate Today : గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పరుగులు తీస్తోంది. ఈ ఏడాది నవంబర్ నుంచి యూఎస్ వడ్డీ రేట్లలో కోత ప్రారంభం కావచ్చునని ప్రచారం నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ప్రత్యామ్నాయ పెట్టుబడిగా గోల్డ్ పై మక్కువ చూపుతున్నారు. మరోవైపు, చైనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చుననే ప్రచారంతో బంగారం ధరలో జోష్ పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రామాలు 24 క్యారెట్ల బంగారంపై రూ. 540 పెరింది. మరోవైపు కిలో వెండి ధర రూ. లక్ష దాటింది. సోమవారం ఒక్కరోజే కిలో వెండిపై రూ. 4,500 పెరిగింది. దీంతో వెండి ధర గతంలో ఎప్పుడూ లేనంతగా రూ. లక్ష దాటింది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,900కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.75,160.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.69,050 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 75,310.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,900 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 75,160.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.69,000 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.75,280.

Gold

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.1,01,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ.1,01,000.
    కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.96,500.
    బెంగళూరులో కిలో వెండిపై రూ.3,500 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 96,500 వద్దకు చేరింది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.