Bhimavaram Cosmo Club: పేకాటకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్లు.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

13 కార్డ్స్ కు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో భీమవరం కాస్మో పాలిటిన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్, నర్సాపురం యూత్ క్లబ్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Bhimavaram Cosmo Club: పేకాటకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్లు.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court Representative Image (Image Credit To Original Source)

Updated On : January 6, 2026 / 10:57 PM IST
  • పేకాటకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లు
  • 3 క్లబ్ లకు షాక్ ఇచ్చిన హైకోర్టు
  • డబ్బులు పెట్టి ఆడేందుకు వీల్లేదన్న న్యాయస్థానం
  • డబ్బులు పెట్టి కార్డ్స్ ఆడటం చట్ట విరుద్ధమన్న కోర్టు

Bhimavaram Cosmo Club: పేకాట అనుమతి కోసం పిటిషన్లు వేసిన మూడు క్లబ్ లకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. డబ్బులు పెట్టి ఆడటానికి వీల్లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వలేము అని తేల్చి చెప్పిన న్యాయస్థానం.. అలా ఇవ్వడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది.

13 కార్డ్స్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ భీమవరం కాస్మోపాలిటిన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్, నర్సాపురం యూత్ క్లబ్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. డబ్బులు పెట్టి పందెంగా కార్డ్స్ ఆడటం చట్ట విరుద్ధం అని వ్యాఖ్యానించింది. డబ్బులకు పేకాట ఆడేందుకు వీలు లేదని, అలా ఆడితే అది గ్యాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద చట్ట విరుద్ధ చర్యగా పరిగణించి కేసులు నమోదు చేయాల్సిందే అని తెలిపింది.

సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా 13 కార్డ్స్‌ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని క్లబ్ ల తరపున లాయర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. డబ్బులు పెట్టి కార్డ్స్ ఆడటం చట్ట విరుద్ధమంది.

ఇప్పటికే నూజివీడు మాంగో బే క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పైనా హైకోర్టు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. 13 కార్డ్స్ డబ్బులకు ఆడొద్దంది. ఒకవేళ ఆడితే గ్యాంబ్లింగ్ యాక్ట్ 3, 4 కింద చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్‌ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది. తాజాగా ఇప్పుడు మూడు క్లబ్‌ల పిటిషన్ల విషయంలో కూడా అదే చట్టపరమైన నియమాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.

Also Read: వైసీపీకి సవాల్‌గా మారిన విశాఖ లోక్‌సభ సీటు.. కారణం ఏంటి?