Visakha Loksabha Seat: వైసీపీకి సవాల్‌గా మారిన విశాఖ లోక్‌సభ సీటు.. కారణం ఏంటి?

స్టీల్ సిటీ విశాఖలో పార్టీకి ఉక్కు లాంటి నేత కోసం వైసీపీ పెద్దలు వెతుకాలట మొదలుపెట్టారట. ఎంత సెర్చ్ సరే సరైన ఆప్షన్ కనబడట్లేదంటున్నారు.

Visakha Loksabha Seat: వైసీపీకి సవాల్‌గా మారిన విశాఖ లోక్‌సభ సీటు.. కారణం ఏంటి?

Ys Jagan Representative Image (Image Credit To Original Source)

Updated On : January 6, 2026 / 8:26 PM IST
  • విశాఖ ఎంపీ సీటుపై ఆసక్తి చూపని బొత్స ఝాన్సీ
  • గుడివాడ అమర్‌నాథ్‌ను ఎంపీగా పంపుతారంటూ టాక్
  • ఎంపీగా కంటెస్ట్ చేయడం గుడివాడకు ఇష్టలేదన్న ప్రచారం
  • ఎంవీవీ సత్యనారాయణను యాక్టీవ్‌ చేసే యోచనలో వైసీపీ

Visakha Loksabha Seat: ఆ ఎంపీ సీటు వైసీపీకి ఎప్పుడూ సవాలే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ ఎదురీత తప్పడం లేదు. అటు పార్టీకి, అటు రాష్ట్రానికి అత్యంత కీలకమైన చోట..బలమైన లీడర్లు లేకపోవడంతో ఫ్యాన్‌ పార్టీ ట్రబుల్స్‌ ఫేస్ చేస్తోంది. ఎలాగైనా సరే అక్కడ పాతుకుపోవాలని..ఈ సారి పెద్ద స్కెచ్చే రెడీ చేస్తోందట. మూడు ఆప్షన్లు ఉంటే..రెండు ఆప్షన్స్ ఎగిరిపోయాయట. ఇక ఆ ఒక్క ఆప్షన్ మీదే ఫ్యాన్ పార్టీ హైకమాండ్ హోప్స్ పెట్టుకుందట. ఇంతకు ఏంటా సీటు.? ఎందుకంత ప్రయారిటీ.? వైసీపీ హైకమాండ్‌కు ఎందుకు హెడెక్‌గా మారింది.?

ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన, అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ పార్లమెంట్ సీటుపై అయితే అంతకు మించి కాన్సన్‌ట్రేషన్ పెట్టింది. వైసీపీ ఆవిర్భావం నుంచి..అక్కడ పూర్తి స్థాయి పట్టు సాధించలేకపోవడం ఫ్యాన్ పార్టీని కలవరపెడుతోందట. రాష్ట్రంలో అన్ని చోట్లా జెండా రెపరెపలాడినా, సాగర నగరం విశాఖలో మాత్రం పాతుకుపోవడం కుదరట్లేదట. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో ట్రయాంగిల్ ఫైట్‌లో విశాఖ ఎంపీ సీటును వైసీపీ గెలిచినా సరే, అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది.

ఇటీవల ఎన్నికల్లో కూటమి అబ్యర్థులు విశాఖలో స్టేట్ లెవల్‌ రికార్డు స్థాయి మెజార్టీలు సాధించగా, వైసీపీ అభ్యర్థులు కనీస పోటీని ఇవ్వలేక చేతులేత్తేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఫ్యూచర్‌లో ఇక కోలుకునే పరిస్థితి ఉండదని వైసీపీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. అందుకే విశాఖపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టిందని టాక్.

పార్టీకి సవాల్‌గా మారిన విశాఖ ఎంపీ స్థానంలో ఇంచార్జ్‌గా బలమైన నేతను బరిలోకి దింపాలని వైసీపీ పకడ్బందీగా పావులు కదుపుతోందట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా..సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పోటీ చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన నాయకురాలిగా ఉన్న ఆమెను పార్టీ బరిలో నిలిపితే గౌరవ ప్రదమైన ఓట్లను కూడా సాధించలేకపోయారు. కనీసం 30 శాతం ఓట్లను కూడా సాధించలేక చితికిలపడ్డారు.

విశాఖ పార్లమెంట్ పరిధిలో బలమైన నాయకుడి కోసం సెర్చ్..

గత ఎన్నికల ఫలితాల తర్వాత బొత్స ఝాన్సీ సొంతూరు విజయనగరం జిల్లాకు మాత్రమే పరిమితమై, విశాఖ వైపు కన్నెత్తి చూడటం మానేశారు. గత కొన్నాళ్లుగా విశాఖకు చెందిన అంశాలపై రాజకీయంగా రచ్చ రచ్చ జరుగుతున్నా సరే ఆమె ఎక్కడా కనపడట్లేదు. పోనీ విజయనగరంలోనైనా సరే పార్టీ యాక్టివిటీలో ఆమె వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అయితే బొత్స ఝాన్సీ ఇప్పుడు విశాఖ ఎంపీ స్థానంలో బాధ్యతలు చేపట్టడానికి సముఖంగా లేరని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం కూడా ఇదే అంశాన్ని గ్రహించిందట. దీంతో విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేలా బలమైన నాయకుడి కోసం టార్చ్ ఆన్ చేసి సెర్చ్ చేస్తోందని టాక్.

బెస్ట్ ఆప్షన్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారి..!

స్టీల్ సిటీ విశాఖలో పార్టీకి ఉక్కు లాంటి నేత కోసం వైసీపీ పెద్దలు వెతుకాలట మొదలుపెట్టారట. ఎంత సెర్చ్ సరే సరైన ఆప్షన్ కనబడట్లేదంటున్నారు. దీంతో సరికొత్త ప్లాన్ దిశగా పార్టీ పెద్దలు అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారంలో ఉంది. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయించే ప్లాన్ చేశారట. కానీ గుడివాడ అమర్‌నాథ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేయనని..తనకు స్టేట్‌ పాలిటిక్స్ అంటేనే ఇష్టమంటున్నారట. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్‌లో అడుగు పెట్టాలనేది ఆయన కల అంటున్నారు. దీంతో గతంలో విశాఖ పార్లమెంట్‌కు వైసీపీ నుంచి ఎన్నికైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవీవీ సత్యనారాయణనే ప్రస్తుతానికి బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నారట.

గత ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ను తిరిగి రీయాక్టివేట్ చేయడం ద్వారా క్యాడర్‌కు మంచి సంకేతాలు పంపాలన్నది వైసీపీ ప్లాన్ అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంవీవీ కూడా ఎక్కడా యాక్టీవ్‌గా కనిపించడం లేదు. పొలిటికల్‌గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తన వ్యాపార, వ్యవహారాలను మాత్రమే చక్కబెట్టుకుంటున్నారు. వైసీపీకి అంటీముట్టనట్లుగా ఉంటూ..పార్టీని గాలికి వదిలేశారు. అయినా ఆయనపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా పార్టీ అధినేత జగన్‌తో జరిగే ప్రతీ సమావేశానికి ఎంవీవీకి ఇప్పటికీ ఆహ్వానం పంపుతూనే ఉన్నారట.

ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకున్నా..వైసీపీ పెద్దలు మాత్రం ఆయన్ను దూరం పెట్టినట్లు కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు ఎంవీవీని యాక్టివేట్ చేస్తే విశాఖ ఎంపీ సీటుతో పాటుగా ఈ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోని క్యాడర్‌కు ఊపు వస్తుందని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారట. కూటమి అధికారంలోకి రాగానే ఎంవీవీకి చెందిన హయగ్రీవ ప్రాజెక్ట్స్, సిరిపురంలోని ఎంవీవీ పీక్ వంటి భారీ నిర్మాణాలపై కన్నెర్ర చేసింది. దీంతో ఎంవీవీ పొలిటికల్‌గా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీ పెద్దలు ఆయన్ను రియాక్టివేట్‌ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఎంవీవీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా..లేక కూటమి పవర్‌లో ఉందని మొహం చాటేస్తారా..అన్నది క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Also Read: ఉదయగిరిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఫైట్.. అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా అంతర్గత విభేదాలు.. మహిళ ఎంట్రీ..