Samsung Galaxy Z Flip 6 : అమెజాన్‌లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గింది. అమెజాన్‌లో రూ. 66,885కే లిస్ట్ అయింది. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..
Samsung Galaxy Z Flip 6 (Image Credit To Original Source)
- అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 రూ.66,885కి లభ్యం
- లాంచ్ ధర కన్నా రూ.43వేలకు తగ్గింపు, అదనపు బ్యాంక్ ఆఫర్లు
- 6.7-అంగుళాల అమోల్డ్ 120Hz డిస్‌ప్లే, కాంపాక్ట్ ఫ్లిప్ డిజైన్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు
- 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 10MP సెల్ఫీ కెమెరా, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్
Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ అభిమానులు తప్పక కొనాల్సిన ఫోన్.. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఫోన్ భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. ప్రత్యేకించి భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్ రూ. 1,09,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ మడతబెట్టే ఫోన్ రూ. 43వేల కన్నా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ఈ శాంసంగ్ ఫోన్ యూజర్లకు FHD+ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X మెయిన్ స్క్రీన్ అందిస్తుంది. ఆసక్తిగల కస్టమర్లు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, గెలాక్సీ ఏఐ ఫీచర్‌లతో పాటు ప్రీమియం ఇన్-హ్యాండ్ ఫీల్ అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 అమెజాన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 రూ.1,09,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అయితే, ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.66,885కే లభ్యమవుతోంది. అంటే.. రూ.43,114 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Samsung Galaxy Z Flip 6 (Image Credit To Original Source)
అలాగే కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,500 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ కొనుగోలుదారులకు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే అదనపు తగ్గింపు కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్, బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి రూ.44,450 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X మెయిన్ స్క్రీన్, FHD+ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ ఔటర్ డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇంకా, ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ 4000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
