Sanga Reddy: సంగారెడ్డి కాంగ్రెస్‌లో మున్సిపల్ వార్.. జగ్గారెడ్డి ప్రకటనతో రచ్చ రచ్చ.. సీనియర్లు సీరియస్..!

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావుడి పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. Sanga Reddy

Sanga Reddy: సంగారెడ్డి కాంగ్రెస్‌లో మున్సిపల్ వార్.. జగ్గారెడ్డి ప్రకటనతో రచ్చ రచ్చ.. సీనియర్లు సీరియస్..!

Jagga Reddy Representative Image (Image Credit To Original Source)

Updated On : January 6, 2026 / 9:00 PM IST

 

  • రెండు మున్సిపాలిటీల కార్యకర్తలతో జగ్గారెడ్డి సమీక్ష
  • సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పేర్ల ప్రకటన
  • సీనియర్లు ఉండగా జూనియర్లకు ఎలా అవకాశం ఇస్తారని గొడవ

Sanga Reddy: ఇప్పుడేం ఎన్నికలు లేవు. ఈ నెలాఖరులో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చంటున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికల వర్క్ కంప్లీట్ చేశారట ఆ సీనియర్ నేత. ఏకంగా మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులను కూడా అనౌన్స్ చేసేశారు. ఇదే ఇప్పుడు చిచ్చు పెట్టింది. తన మాటే శాసనం అంటూ ఆయన.. సీనియర్లు ఉండగా..జూనియర్లకు ఎలా ఇస్తారని ఒకరిద్దరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ స్టార్ట్ అయ్యిందట. ఇంతకు ఏ నియోజకవర్గంలో ఈ సీన్? ఆ కోయిల ముందే ఎందుకు కూసింది? వివాదం ఎక్కడ మొదలైంది?

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఓటర్ జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్లలో మార్పులు, చేర్పుల వంటి డెవలప్ మెంట్‌తో త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్న చర్చ జరుగుతోంది. వారం పది రోజుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ అని కొందరు..ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని మరికొందరు అంచనాలతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సంగారెడ్డి జగ్గారెడ్డి మాత్రం మిగతా కాంగ్రెస్ లీడర్ల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు అలా ముగిశాయో లేదో..ఇలా మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఎవరెవరికి ఏయే పోస్టులు ఇవ్వాలో డిసైడ్ కూడా చేశారు. దీంతో మిగతా ఆశావహులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రచ్చ చేయడం హాట్ టాపిక్గా మారింది.

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావుడి పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అయితే ముఖ్య కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి చేసిన ఓ ప్రకటన రసాభాసకు దారితీసింది. సంగారెడ్డి, సదాశివపేట రెండు మున్సిపాలిటీలు ఉండగా సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా కూన సంతు, వైస్ ఛైర్మన్‌గా షఫీని ప్రకటించారు జగ్గారెడ్డి. ఇక సదాశివపేట మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పేర్లను తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. ఒకవేళ రిజర్వేషన్లు మారి సంగారెడ్డి మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వ్ అయితే మహేష్ లాల్ ఛైర్మన్‌గా ఉంటారని జగ్గారెడ్డి ఎనౌన్స్ చేశాడు.

సీనియర్లు ఉండగా జూనియర్లకు అవకాశం ఇవ్వమేంటి?

అసలు ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు..పైగా కౌన్సిలర్లుగా ఎవరెవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. అంతకంటే ముందే ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను అనౌన్స్ చేయడమేంటంటూ ఓవైపు చర్చ జరుగుతూనే ఉంది. సరిగ్గా ఇదే టైమ్‌లో మీటింగ్‌లో రచ్చ స్టార్ట్ అయింది. సంగారెడ్డి మున్సిపాలిటీలోని శాంతినగర్ వార్డుకు చెందిన సునీల్..మహేష్ లాల్‌ను మున్సిపల్ ఛైర్మన్‌గా ఎలా ప్రకటిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతోమంది సీనియర్లు ఉండగా..మహేష్ లాల్ కు అవకాశం ఇవ్వమేంటని ప్రశ్నించాడు సునీల్. దీంతో సభ రసాభాసగా మారింది.

ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి..

ఒకదశలో జగ్గారెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. ఎవరూ వీడియోలు తీయకండి ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంత శాంతించిన జగ్గారెడ్డి ఇది పార్టీ నిర్ణయం సునీల్ అని చెప్పినా వినకపోవడంతో బయటకు పంపించి సభను యథావిధిగా నడిపించారు. సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలలో అభ్యర్ధులను మీరే నిర్ణయించుకుని గెలిపించుకుని రావాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి. ప్రచారానికి రానని, కౌన్సిలర్ టికెట్ కావాలని తన దగ్గరకు కానీ, నిర్మలా జగ్గారెడ్డి దగ్గరకు కానీ ఎవరూ రావొద్దని స్పష్టం చేశారు. ఈ రెండు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిందేని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జగ్గారెడ్డి.

అయితే కోయిల ముందే కూసిందన్నట్లుగా..జగ్గారెడ్డి ముందుగా మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పేర్లను ప్రకటించడం చర్చకు దారితీస్తోంది. ముఖ్యనేతలెవరితో చర్చించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను అనౌన్స్ చేయడమే రచ్చకు దారితీసిందంటున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్లు. ఎన్నో ఏళ్లుగా తాము కాంగ్రెస్ జెండా మోస్తున్నామని..అవకాశం వచ్చినప్పుడు కూడా తమలాంటి వాళ్లకు టికెట్ ఇవ్వకుండా.. నచ్చిన నేతలను అందలమెక్కించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదైనా తన మార్క్ డెసిషన్స్‌తో..జగ్గారెడ్డి మరోసారి చర్చకు..సేమ్‌టైమ్ రచ్చకు అవకాశం ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: దూకుడు పెంచిన కవిత.. ఇప్పుడు పెద్ద సార్‌పైనే అటాక్.. అయినా వై దిస్ సైలెన్స్?