Kavitha: దూకుడు పెంచిన కవిత.. ఇప్పుడు పెద్ద సార్‌పైనే అటాక్.. అయినా వై దిస్ సైలెన్స్?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు నేరుగా తీసుకోకపోయినా ఆయనపై విమర్శలు చేశారు కవిత. శాసనమండలి సాక్షిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై సంచలన ఆరోపణలు చేశారు. Kavitha

Kavitha: దూకుడు పెంచిన కవిత.. ఇప్పుడు పెద్ద సార్‌పైనే అటాక్.. అయినా వై దిస్ సైలెన్స్?

Kavitha Representative Image (Image Credit To Original Source)

Updated On : January 6, 2026 / 7:58 PM IST
  • రోజురోజుకు డోస్ పెంచుతున్న ఎమ్మెల్సీ కవిత
  • మండలి సాక్షిగా కన్నీళ్లతో బీఆర్ఎస్‌పై విమర్శల దాడి
  • వాడకూడని పదాలతో మండలి వేదికగా కేసీఆర్‌కు ప్రశ్నలు
  • కవిత సీరియస్ అలిగేషన్ చేస్తున్నా.. వై దిస్ సైలెన్స్.?
  • మండలిలో కవితకు స్పీచ్ ఛాన్స్ ఇవ్వడంపైనా బీఆర్ఎస్‌లో చర్చ

 

Kavitha: నిన్నమొన్నటి వరకు ఆమె టార్గెట్ హరీశ్‌రావు. అప్పుడప్పుడు కేటీఆర్‌పై అటాక్. మధ్యలో సంతోష్‌పై సెటైర్లు. కానీ ఇప్పుడు అక్క..డైరెక్ట్‌గా గులాబీ బాస్‌పైనే బాణాలు ఎక్కు పెడుతోంది. పెద్ద సార్ టార్గెట్‌గానే..ఇంకా చెప్పాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష్యంగానే ఆమె రాజకీయ పోరాటం ఉండబోతుందన్నది చెప్పకనే చెప్పేస్తోంది. కానీ కవిత కామెంట్స్‌పై కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి మాత్రం నో రియాక్షన్. కవిత రోజు రోజుకు డోస్ పెంచుతున్నా బీఆర్ఎస్‌ కీలక నేతలెవరూ స్పందించడం లేదు. ఇదే ఇప్పుడు కారు పార్టీలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

కారులో ఉన్నప్పుడే అందరినీ కార్నర్ చేసింది. ఒక్క అధినేతను వదిలిపెట్టి..హరీశ్, కేటీఆర్, సంతోష్‌ను..వరుసపెట్టి అటాక్ చేస్తూ వచ్చింది కవిత. ఇక బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాక..ఆమె విమర్శల దాడి ఇంకా ఎక్కువైంది. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కవిత.

అయినా హరీశ్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్యనేతలెవరూ ఆమె కామెంట్స్‌పై అస్సలు రియాక్ట్ కావడం లేదు. లేటెస్ట్‌ మండలి వేదికగా కవిత మాట్లాడిన తీరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు హరీష్ రావు, కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ముఖ్యనేతలందరిపైనా విమర్శలు చేస్తూ వస్తున్న కవిత ఇప్పుడు మరింత స్పీడ్ పెంచారు. మొన్నటివరకు కేసీఆర్ దేవుడని, తన హీరో అని చెప్పిన కవిత..ఇప్పుడు ఆయనపైన ఇండైరెక్ట్ అటాక్ చేయడం చర్చకు దారితీస్తోంది.

మండలి సాక్షిగా కేసీఆర్ పాలనపై సంచలన ఆరోపణలు..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు నేరుగా తీసుకోకపోయినా ఆయనపై విమర్శలు చేశారు కవిత. శాసనమండలి సాక్షిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం అంటూ పరోక్షంగా కేసీఆర్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు కవిత. తెలంగాణను ఏం ఉద్దరించామని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలకు వెళ్లారంటూ మండలిలో ఉచ్చరించకూడని భాషతో తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నించారామె.

కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ పార్టీ, పాలనపై కవిత చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముందు హరీశ్‌రావు, తర్వాత కేటీఆర్, ఇప్పుడు నేరుగా అధినేత కేసీఆర్‌ను అంటే మొత్తం కేసీఆర్ ఫ్యామిలీనే కవిత టార్గెట్ చేస్తున్నా..వాళ్లేవరు ఆమె కామెంట్స్‌పై ఎందుకు స్పందించడం లేదన్నది బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎదురవుతున్న ప్రశ్న.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు రియాక్ట్ కావడం లేదు?

కవిత వ్యాఖ్యలు, ఆమె చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. ఆమె శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకుని మరీ అధినేత కేసీఆర్ సహా పార్టీపై, తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ఆరోపణలు చేయడంపై గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారట. కవిత ఇంతలా సీరియస్ కామెంట్స్ చేసినా..అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు రియాక్ట్ కావడం లేదన్నది బీఆర్ఎస్ నేతలకు, క్యాడర్‌కు అంతుచిక్కడం లేదట.

కవిత వ్యాఖ్యలపై పార్టీ నుంచి ఎంత మంది మాట్లాడినా ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఎఫెక్ట్ వేరేగా ఉంటుందని చర్చించుకుంటున్నారట. లేకపోతే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇదే సమయంలో కవిత ఆరోపణలను అధినేత కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్, హరీశ్‌రావు ఖండించకపోతే పార్టీకి నష్టం జరగడంతో పాటు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలకు అస్త్రాలుగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందట.

మౌనం వెనుక ఆంతర్యం ఏంటి?

పార్టీ మహిళా నేతలతో కవితకు కౌంటర్ ఇప్పించినా అది ప్రజల్లోకి వెళ్లదని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ఆమె ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్లు సమాధానం చెప్తేనే బాగుంటుందన్న ఒపీనియన్స్ వస్తున్నాయట. అయితే కవిత అంతలా ఫ్యామిలీ మెంబర్స్‌ను టార్గెట్ చేస్తున్నా వాళ్లు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం వేరే ఉందన్న టాక్ వినిపిస్తోంది. కవిత ఎంత కాదనుకున్నా తమ కుటుంబ సభ్యురాలేనని, అధినేత కేసీఆర్ కూతురు కాబట్టి..ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా కేటీఆర్, హరీశ్‌రావు మౌనంగా ఉండాల్సి వస్తోందట.

కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో లేకున్నా తమ ఫ్యామిలీ మెంబరే కావడంతో ఆమెపై తాము మాట్లాడటం సరికాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత ఇలా అధినేత కేసీఆర్‌పైనా తీవ్ర ఆరోపణలు చేస్తున్నా మౌనంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌తో పాటు జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో కవిత దూకుడు ఎలా ఉంటుందో..బీఆర్ఎస్ రియాక్షన్ ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి.

Also Read: కోటి రూపాయల ఇన్సూరెన్స్- ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం