Simple Energy : ఫ్యామిలీ కస్టమర్లకు పండగే.. సింపుల్ వన్ జెన్ 2, అల్ట్రా స్కూటర్లు.. సింగిల్ ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్.. లైఫ్ టైమ్ వారంటీ..
Simple Energy : సింపుల్ ఎనర్జీ అడ్వాన్స్ స్మార్ట్ ఫీచర్లతో సింపుల్ వన్ జెన్ 2 లాంచ్ చేసింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ సింగిల్ ఛార్జ్‌పై 400 కి.మీ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని పేర్కొంది. ఇంకా, కంపెనీ స్కూటర్‌పై లైఫ్ టైమ్ వారంటీని అందిస్తోంది.
Simple Energy Gen 2 Scooters (Image Credit To Original Source)
- సింపుల్ అల్ట్రా, సింపుల్ వన్ జెన్ 2 సింపుల్ వన్ జెన్ 2, సింపుల్ వన్స్ జెన్ 2 స్కూటర్లు
- 190 కి.మీ నుంచి 400 కి.మీ వరకు ఐడీసీ రేంజ్
- మోటార్, బ్యాటరీపై లైఫ్ టైమ్ వారంటీ
- కొత్త 5kWh బ్యాటరీతో సింపుల్ వన్ జెన్ 2 టాప్ వేరియంట్
Simple Energy : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ టీవీలర్ కంపెనీ సింపుల్ ఎనర్జీ నుంచి పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ జెన్ 2 వెర్షన్ లాంచ్ అయింది. ఈ కొత్త స్కూటర్ జెన్ 1.5 ఆధారంగా అడ్వాన్స్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
అదేవిధంగా, కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ సింపుల్ అల్ట్రాను కూడా ప్రవేశపెట్టింది. కంపెనీ సింపుల్ వన్ జెన్ 2 డిజైన్, రైడ్ క్వాలిటీ, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్‌లకు అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్స్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంచ్ ధర ఆఫర్ గడువు తర్వాత రూ. 1.50 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరుగుతుంది.
డిజైన్, హార్డ్‌వేర్ అప్ గ్రేడ్స్ :
సింపుల్ వన్ జెన్ 2 డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. స్ట్రక్చరల్ జాయింట్లు బ్యాటరీ చుట్టూ క్రాష్ జోన్ ద్వారా సేఫ్టీని అందిస్తుంది. కొత్త టైర్ కాంపౌండ్‌తో సీటు ఎత్తు 16 మి.మీకు తగ్గింది. సీటు ఫోమ్ ఇప్పుడు స్పోర్టియర్‌గా ఉంది. లాంగ్ రైడ్‌లకు సౌకర్యవంతంగా ఉంటుంది.
కొత్త బ్యాటరీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్ :
సింపుల్ వన్ జెన్ 2 టాప్ వేరియంట్ కొత్త 5kWh బ్యాటరీతో వస్తుంది. చాలా తేలికగా ఉంటుంది. బ్యాటరీ బరువు 34 కిలోల నుంచి 30 కిలోలకు తగ్గింది. ఎలక్ట్రిక్ మోటారు 8.8 kW పీక్ పవర్ 72Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సింగిల్ ఛార్జ్ చేస్తే 265 కి.మీ రేంజ్ అందిస్తుంది. 4.5kWh బ్యాటరీతో వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కి.మీ రేంజ్ ఈ రెండు వేరియంట్లు కేవలం 2.55 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం స్పీడ్ అందుకుంటాయి. స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ అందిస్తుంది.
సింపుల్ వన్స్ బేస్ వెర్షన్ :
సింపుల్ వన్స్ వేరియంట్ స్కూటర్ చిన్నపాటి 3.7kWh బ్యాటరీతో వస్తుంది. 190 కి.మీ ఐడీసీ రేంజ్ అందిస్తుంది. లో పవర్ మోటారుతో వస్తుంది. 6.4kW పవర్ 52Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ రోజువారీ వినియోగానికి సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కోరుకునే వారికి అద్భుతంగా ఉంటుంది.

Simple Energy Ultra (Image Credit To Original Source)
వేరియంట్లు, ధరలివే
236 కి.మీ. ఐడీసీ రేంజ్‌తో సింపుల్ వన్ 4.5kWh ధర రూ. 1.69,999, 265 కి.మీ. ఐడీసీ రేంజ్‌తో సింపుల్ వన్ 5kWh వేరియంట్ రూ. 1,77,999 అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ధరకు లభిస్తాయి. 190 కి.మీ. ఐడీసీ రేంజ్‌తో సింపుల్ వన్‌ఎస్ జెన్ 2 రూ. 1,39,999 లక్షల ఆఫర్ అందిస్తోంది. ఇది ఆఫర్ తర్వాత రూ. 1,49,999 లక్షలకు పెరుగుతుంది.
సింపుల్ వన్ అల్ట్రా స్పెషాలిటీ ఏంటి? :
కంపెనీ సింపుల్ వన్ అల్ట్రా వేరియంట్‌ను కూడా ఆవిష్కరించింది. భారీ 6.5kWh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 400 కి.మీ ఐడీసీ రేంజ్‌ను అందిస్తుందని పేర్కొంది. ఈ వేరియంట్ కేవలం 2.77 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వరకు వేగాన్ని అందుకోగలదు.
సింపుల్ OS కొత్త స్మార్ట్ ఫీచర్లు :
సింపుల్ ఎనర్జీ జెన్ 2 సింపుల్OSకి అనేక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందిస్తుంది. సింపుల్ ఎనర్జీ నుంచి EcoX, SonicX అనే రెండు కొత్త రైడింగ్ మోడ్‌లను లాంచ్ అయ్యాయి. EcoX రైడర్ థ్రోటిల్ ఇన్‌పుట్, స్పీడ్ ప్యాటర్న్ అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.
SonicX మోడ్ స్కూటర్ ఫుల్ టాప్ స్పీడ్ 115kmphని అందిస్తుంది. ఈ స్కూటర్‌లో 4 ట్రాక్షన్ మోడ్‌లు, 4 లెవల్స్ రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉన్నాయి.
అదనంగా, రెండు-లెవల్ క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, వెహికల్ ఫాల్ కటాఫ్ హార్డ్ బ్రేకింగ్ సమయంలో యాక్టివేట్ అయ్యే ఎమర్జెన్సీ బ్రేక్ లైట్లను కూడా అందిస్తుంది. 5kWh బ్యాటరీ వేరియంట్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే కలిగి ఉంది.
సింపుల్ వన్స్ 7-అంగుళాల నాన్-టచ్ TFT స్క్రీన్ కలిగి ఉంది. డిస్‌ప్లే డార్క్ లైట్ మోడ్ ఆప్షన్లను కలిగి ఉంది. అన్ని వేరియంట్లలో 35-లీటర్ బూట్ స్పేస్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
లైఫ్ టైమ్ వారంటీ :
ఈ స్కూటర్ సోనిక్ రెడ్, ఏరో ఎక్స్ ఆస్ఫాల్ట్ ఎక్స్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, కంపెనీ అన్ని జెన్ 2 స్కూటర్లపై లైఫ్ టైమ్ వారంటీని కూడా అందిస్తోంది. వేరియంట్‌ను బట్టి 2 గంటల 15 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ అయ్యేలా పబ్లిక్ ఫాస్ట్-ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది.
