Motorola Edge 50 Pro : కిర్రాక్ డిస్కౌంట్ బ్రో.. ఈ మోటోరోలా ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఏకంగా రూ. 13వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Motorola Edge 50 Pro (Image Credit To Original Source)
- మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర తగ్గింపు
- అమెజాన్‌లో రూ. 13వేలు తగ్గింపు
- బ్యాంకు ఆఫర్లతో అదనంగా రూ.1250 డిస్కౌంట్
Motorola Edge 50 Pro : మోటోరోలా కొత్త ఫోన్ కావాలా? మీకు తక్కువ ధరలో కొత్త ఫోన్ కావాలంటే ఇప్పుడే కొనేసుకోండి. అమెజాన్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం మోటరోలా ఎడ్జ్ 50 ప్రో రూ. 13వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, అదిరిపోయే పర్ఫార్మెన్స్, 125W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది.
ఈ కీలక ఫీచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై ఎంత ధర తగ్గిందో ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర తగ్గింపు :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB వేరియంట్) ఫోన్ రూ.35,999కు లాంచ్ కాగా అమెజాన్ ఇప్పుడు ఎడ్జ్ 50 ప్రోపై రూ.11,805 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ ధర రూ.24,194కు తగ్గింది.
Read Also : Samsung Phone Prices : శాంసంగ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన శాంసంగ్ ఫోన్ల ధరలు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
అలాగే, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ.1,250 అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ, మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Motorola Edge 50 Pro (Image Credit To Original Source)
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ 125W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ అందిస్తుంది.
డిస్ప్లే విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ HDR10+ సపోర్ట్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED స్క్రీన్ ఉంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
