Samsung Phone Prices : శాంసంగ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన శాంసంగ్ ఫోన్ల ధరలు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Samsung Phone Prices : శాంసంగ్ గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ F17 5G మోడళ్ల ధరలను భారీగా పెంచింది. ఏయే ఫోన్ల ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం..
Samsung Smartphone Prices (Image Credit To Original Source)
- భారత మార్కెట్లో పెరిగిన శాంసంగ్ ఫోన్ల ధరలు
- కొత్త ధరలు జనవరి 5 నుంచి అమల్లోకి
- గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ F17 ధరల పెంపు
- శాంసంగ్ బాటలోనే వివో, నథింగ్ కంపెనీలు
Samsung Phone Prices : శాంసంగ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాకింగ్ న్యూస్.. భారత మార్కెట్లో శాంసంగ్ ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. జనవరి 5 నుంచి శాంసంగ్ గెలాక్సీ మోడళ్లపై కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అన్ని వేరియంట్లపై గరిష్టంగా రూ. 2వేలు పెంచింది.
ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ F17 5G ధరలు పెరిగాయి. గెలాక్సీ ఫోల్డ్ 7, గెలాక్సీ ఫ్లిప్ 7, గెలాక్సీ S25, గెలాక్సీ S25 FE, గెలాక్సీ A06 5Gతో సహా అనేక ఇతర శాంసంగ్ మోడళ్ల ధరలు కూడా త్వరలో పెరగనున్నాయి. వివో, నథింగ్ వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఇతర మోడళ్ల ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ A56 కొత్త ధర ఎంతంటే? :
నివేదికల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A56 అన్ని మోడళ్ల ధరలు రూ.2వేలు పెరిగాయి. గతంలో రూ. 44,999గా ఉన్న 12GB+256GB మోడల్ ధర ఇప్పుడు రూ. 46,999 లభిస్తోంది. గతంలో రూ. 41,999గా ఉన్న 8GB+256GB మోడల్ ధర ఇప్పుడు రూ. 43,999కు లభిస్తోంది. గతంలో రూ. 38,999గా ఉన్న 8GB+128GB మోడల్ ధర ఇప్పుడు రూ. 40,999కి లభిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A36, గెలాక్సీ F17 5G కొత్త ధరలివే :
శాంసంగ్ గెలాక్సీ A36 ధర రూ.1,500 పెరిగింది. గతంలో 12GB/256GB మోడల్ రూ.36,999 ఉండగా ఇప్పుడు రూ.38,499గా మారింది. 8GB/256GB మోడల్ రూ.33,999గా ఉంటే ఇప్పుడు రూ.35,499గా మారింది. అదేవిధంగా, గతంలో రూ.30,999గా ఉన్న 8GB+128GB మోడల్ ఇప్పుడు రూ.32,499కు లభ్యమవుతోంది.
Read Also : Apple iPhone 16 Price : మెగా డిస్కౌంట్! ఈ ఆపిల్ ఐఫోన్ 16 చాలా చీప్, ఇలా కొన్నారంటే..
శాంసంగ్ గెలాక్సీ F17 5G ధర రూ.1,000 పెరిగింది. 4GB+128GB మోడల్ ధర రూ.14,499 నుంచి రూ.15,499కి పెరిగింది. 6GB+128GB మోడల్ ధర రూ.15,999 నుంచి రూ.16,999కి పెరిగింది. గతంలో రూ.17,499గా ఉన్న 8GB+128GB మోడల్ ధర ఇప్పుడు రూ.18,499కి పెరిగింది.

Samsung Hikes Smartphone Prices in India
వివో, నథింగ్ ఫోన్ల ధరల పెంపు :
ఒక్క శాంసంగ్ మాత్రమే కాదు.. వివో, నథింగ్ కూడా అనేక మోడళ్ల ధరలను భారీగా పెంచాయి. వివో Y31 మోడల్ ప్రారంభ ధర రూ.14999 ఉంటే ఇప్పుడు రూ.16999కు పెరిగింది. అంటే.. ధర రూ.2వేలు పెరిగింది. గతంలో రూ.18999గా ఉన్న వివో Y31 ప్రో ఇప్పుడు రూ.1000 పెరిగి రూ.19,999గా ఉంది. నివేదికల ప్రకారం.. నథింగ్ మోడళ్లలో నథింగ్ ఫోన్ 3a లైట్ లాంచ్ ధర రూ.20999 ఉండగా ఇప్పుడు రూ.1000 పెరిగి రూ.21999కు లభ్యమవుతోంది.
స్మార్ట్‌ఫోన్ల ధరల పెంపు ఎందుకంటే? :
ప్రపంచవ్యాప్తంగా మెమెరీ చిప్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. దాంతో చిప్ కొరత ఏర్పడింది. మొబైల్ ఫోన్ తయారీదారులకు చిప్ తయారీకి అదనపు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు మొబైల్ ఫోన్ల ధరలను పెంచాలని భావిస్తున్నాయి.
