Tdp Vs Ysrcp: రెండు రాష్ట్రాల మధ్య జల జగడం.. ఏపీలోని రెండు పార్టీల మధ్య రాజకీయ రగడకు ఎలా దారితీసింది?

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై టూ స్టేట్స్‌ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెగ్యులర్‌గా రచ్చ నడుస్తూనే ఉంది. Tdp Vs Ysrcp

Tdp Vs Ysrcp: రెండు రాష్ట్రాల మధ్య జల జగడం.. ఏపీలోని రెండు పార్టీల మధ్య రాజకీయ రగడకు ఎలా దారితీసింది?

Chandrababu Jagan Representative Image (Image Credit To Original Source)

Updated On : January 6, 2026 / 8:44 PM IST

 

  • ఈ గట్టున మొదలై.. ఆ గట్టులో హీటెక్కిస్తోన్న నీళ్ల జగడం
  • రేవంత్, హరీశ్‌ వ్యాఖ్యల చుట్టూ..టీడీపీ, వైసీపీ డైలాగ్‌వార్
  • ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ పరస్పర ఆరోపణలు

Tdp Vs Ysrcp: నీళ్లు నిప్పులు. ఇటు తెలంగాణ..అటు ఏపీలో ట్రెండింగ్‌ అయింది. ఈ గట్టున మొదలైన పంచాయితీ..ఆ గట్టుకు చేరుకుంది. అక్కడ టీడీపీ, వైసీపీ వాటర్‌ వార్‌ మైలేజ్‌ కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. రేవంత్‌ వ్యాఖ్యలను బేస్‌ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తుంటే..హరీశ్‌రావు కామెంట్స్‌ ఆధారంగా..వైసీపీపై విమర్శల దాడి చేస్తోంది టీడీపీ. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే..మీ హయాంలో అంటూ ఒకరిపై ఒకరు బాణాలు విసురుకుంటున్నారు. ఇంతకీ ఏంటా జల వివాదం? రెండు రాష్ట్రాల మధ్య వాటర్‌ వార్ కాస్త ..రెండు పార్టీల మధ్య పంచాయితీకి ఎలా దారితీసింది?

తెలంగాణ పాలిటిక్స్‌ కాస్త ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ ప్రెస్‌మీట్‌ మొదలైన వాటర్‌ వార్..సీఎం రేవంత్ స్పీచ్‌..దానికి కౌంటర్‌గా హరీశ్‌ పీపీటీ మరింత హీటెక్కింది. ఈ క్రమంలో అటు సీఎం రేవంత్..ఇటు హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో రీసౌండ్ చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం..ఇప్పుడు ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మద్యం రాజకీయ రగడను రాజేసింది. మీ హయాంలో అన్యాయం జరిగిందంటే.. మీ హయాంలో అన్యాయం జరిగిందంటూ టీడీపీ, వైసీపీ డైలాగ్‌వార్‌కు దిగుతున్నాయి.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై టూ స్టేట్స్‌ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెగ్యులర్‌గా రచ్చ నడుస్తూనే ఉంది. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో తమకు నీటి వాటాలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ నేతలు అంటుంటే.. ప్రాజెక్టు పూర్తి అయితే కరువు నెల సీమకు నీటి కొరత తీరుతుందని రాయలసీమ వాసులు కోరుకుంటున్నారు. అయితే ప్రాజెక్టుతో ప్లస్ ఏంటి..మైనస్ ఏంటనేది ఎలా ఉన్నా తరచు ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు, మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది.

ఏపీలో చిచ్చు రాజేసిన సీఎం రేవంత్ కామెంట్స్..

అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వార్ ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల మధ్య వార్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ వార్‌కు రీజన్‌గా మారాయి. చంద్రబాబుని ఒప్పించి..లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించాను అని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీకి అస్త్రంగా మారాయి. సీమకు సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని..అందుకు రేవంత్‌ స్టేట్‌మెంటే ఎగ్జాంపుల్‌ అంటూ వైసీపీ అటాక్ చేస్తుంది. జగన్ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం చేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయ్యి ప్రాజెక్టు ఆపేశారని విమర్శలు చేస్తున్నారు.

అటు వైసీపీ అటాక్‌కు రివర్స్‌ చేసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించారని 2022లోనే ట్రైబ్యునల్ పనులు ఆపేసిందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్‌ను తెలంగాణ రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నామని..అనుమతులు లేకుండా పనులు ప్రారంభించి సీమ ప్రజలను వైసీపీ మోసం చేసిందంటున్నారు టీడీపీ నేతలు, మంత్రులు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్దం అనే సవాల్ విసురుతున్నారు మంత్రులు.

హరీశ్ వ్యాఖ్యలతో వైసీపీని కార్నర్ చేసిన టీడీపీ..

కట్ చేస్తే బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావు చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా వైసీపీని కార్నర్ చేస్తోంది టీడీపీ. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ని జగన్ హయాంలోనే తాము ఆపించామన్నారు హరీశ్. ఈ కామెంట్స్‌తో టీడీపీ శ్రేణులు ఇది కదా అసలు మ్యాటర్ అని వైసీపీపై అటాక్ చేస్తున్నాయి. రాయలసీమకు అసలు ద్రోహం చేసింది వైసీపీనే అని రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ను ఆపింది ఎవరన్నది మాత్రం ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ హయాంలో అనుమతులు లేకుండా మొదలు పెట్టడం వల్లే ఆగిపోయిందని టీడీపీ అంటోంది. లేక బీఆర్ఎస్సే ట్రైబ్యునల్‌కు వెళ్లి ఆపిందా అనేది క్లారిటీ లేకుండా పోయింది.

Also Read: వైసీపీకి సవాల్‌గా మారిన విశాఖ లోక్‌సభ సీటు.. కారణం ఏంటి?