రాబోయే మూడు-నాలుగు నెలల్లో ఏపీ ప్రజలకు తెలుస్తుంది: మాజీ ఎంపీ మార్గాని భరత్

ప్రజలు ఎలా ఆలోచించి ఓటు వేశారో తమకు అంతు పట్టడం లేదని అన్నారు.

రాబోయే మూడు-నాలుగు నెలల్లో ఏపీ ప్రజలకు తెలుస్తుంది: మాజీ ఎంపీ మార్గాని భరత్

Margani Bharat

రాబోయే మూడు-నాలుగు నెలల్లో టీడీపీ ప్రభుత్వ తీరు, పరిస్థితి గురించి ఏపీ ప్రజలకు తెలుస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకురావడానికి జగన్ కృషి చేశారని చెప్పారు.

ప్రజలు ఎలా ఆలోచించి ఓటు వేశారో తమకు అంతు పట్టడం లేదని అన్నారు. రాజమండ్రి ప్రజలు తన కుటుంబ సభ్యులు అనుకున్నానని చెప్పారు. ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. ప్రజల నిర్ణయం బాధాకరంగా ఉందని చెప్పారు. ఇప్పుడు శిలాఫలకాలను ధ్వంసం చేస్తే ప్రయోజనం ఏముంటుందని నిలదీశారు.

అమరావతి ఉద్యమంలో నిజమైన రైతులు పాల్గొనలేదని ఆరోపించారు. టీడీపీ నేతలు హామీలను అమలు చేయాలని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పారు. జగన్ తోనే తమ ప్రయాణం ఉంటుందని అన్నారు.

Also Read: కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా ఆయనే.. సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం: కేసీ వేణుగోపాల్