ఏపీలో రూ.50 కోట్లతో పోస్టల్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్ బిల్డింగ్ నిర్మాణం- కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి పెమ్మసాని చెప్పారు.

ఏపీలో రూ.50 కోట్లతో పోస్టల్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్ బిల్డింగ్ నిర్మాణం- కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Union Minister Pemmasani Chandrasekhar (Photo Credit : Google)

Union Minister Pemmasani Chandrasekhar : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరిగిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గత ఐదేళ్లుగా కేంద్రం నిధులు ఎలా ఉంటాయో తెలియని దుస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతికి రూ.15 వేల కోట్లు, రైల్వే బడ్జెట్ నిధులు కేటాయించారని చెప్పారు. 4 కోట్ల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ తో ఉద్యోగ అవకాశాలు వస్తాయని వెల్లడించారు. కోటి మందికి సోలార్ పథకంలో సబ్సిడీ కల్పించడం, 2 కోట్ల రూరల్, కోటి అర్బన్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి పెమ్మసాని చెప్పారు.

దాదాపుగా రూ.80 వేల కోట్ల నిధులు బడ్జెట్ లో కేటాయించారని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందే అవకాశం ఉందన్నారు. నరేగా నిధులు గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించిన మంత్రి పెమ్మసాని.. ఈ ప్రభుత్వంలో ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఏపీలో 50 కోట్లతో పోస్టల్ డిపార్ట్ మెంట్ కమ్యూనికేషన్ బిల్డింగ్ నిర్మాణం చేపడతామన్నారు. ప్రైవేట్ టెలీ కమ్యూనికేషన్ సంస్థలు రేట్లు పెంచిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

Also Read : జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ షర్మిల.. తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్