రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. ధవళేవ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం

వరద ప్రభావం పెరగడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 15 రోజులుగా 4 గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణిస్తున్నారు.

రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. ధవళేవ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం

Godavari Level Rises : రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద క్రమక్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ నీటిమట్టం 15.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజీ 175 గేట్లు ఎత్తి సుమారు 15 లక్షల 75వేల క్యూసెక్సుల నీటిని దిగువకు వదిలారు.

గోదావరి ముంపులో ఉన్న కోనసీమ, లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పి.గన్నవరం మండలం గండి పెదపూరి వద్ద గోదావరిలో పడవ బోల్తా పటగా ఆరుగిరిలో ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రభావం పెరగడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 15 రోజులుగా 4 గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణిస్తున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రానికి ఒక అడుగు మేర గోదావరి నీటిమట్టం పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 175 గేట్లు ఎత్తి.. సుమారుగా 15లక్షల 75వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. గోదావరి నది 4 పాయలుగా విడిపోతుంది(గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ). నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ ముంపులో ఉన్నాయి. బి.గన్నవరం నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం ఉంది.

ప్రమాదం అని తెలిసినా.. 15 రోజులుగా కేవలం నాటు పడవల మీదే గ్రామస్తులు ప్రయాణం సాగిస్తున్నారు. ఇవాళ ఒక ప్రమాదం కూడా జరిగింది. ఆరుగురు ప్రయాణిస్తున్న నాటు పడవ సుడిగుండాల మధ్యలో చిక్కుకుని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతైనట్లు తెలుస్తోంది.

Also Read : జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ షర్మిల.. తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్