కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా ఆయనే.. సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం: కేసీ వేణుగోపాల్

KC Venugopal: సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో తమ పార్టీ ముందుంటుందన్నారు.

కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా ఆయనే.. సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం: కేసీ వేణుగోపాల్

KC Venugopal

రాహుల్ గాంధీని కాంగ్రెస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరుతూ సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

అలాగే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కల్పించిన ఇబ్బందులపై చర్చించినట్లు తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో తమ నేతలను బ్లాక్ మెయిల్ చేశారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కష్టపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చాలామంది అన్నారని తెలిపారు.
ఇండియా కూటమి ఎజెండాను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ కోసం చేసిన కృషిని సమావేశంలో అభినందించామని తెలిపారు.

ఓట్లేసిన ప్రజలకు కాంగ్రెస్ అభినందనలు తెలిపిందన్నారు. మోదీ అసత్యాలు చెప్పారని తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన రెండు యాత్రలు తమ పార్టీకి అన్ని సీట్లు రావడానికి కలిసి వచ్చాయని చెప్పారు. తమతో కలిసి వచ్చిన కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో తమ పార్టీ ముందుంటుందన్నారు.

Also Read: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న దేశాధినేతలు వీరే.. ఢిల్లీలో హైఅలర్ట్