Telangana Police: మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం

రిపోర్ట్ చేయడానికి ప్రజలు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్‌లను..

Telangana Police: మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం

Mobile Phones Recovery

తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుంచి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, ఈ విషయంలో దేశంలో రెండవ స్థానంలో నిలిచారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) సీఈఐఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పోర్టల్ 2023 ఏప్రిల్ 19 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది.

తెలంగాణ రాష్ట్రంలో సిఐడి అదనపు డిజిపి శిఖా గోయెల్, సీఈఐఆర్ పోర్టల్‌కు నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో 780 పోలీస్ స్టేషన్‌లు ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నాయి. 2024లో 206 రోజుల్లో 21,193 పోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ పరికరాలను రికవరీ చేయడంలో పోలీసులు విజయం సాధించారు. గత 8 రోజుల్లోనే 1000 పరికరాలను రికవరీ చేసి, వాటిని ఫిర్యాదుదారులకు అప్పగించారు. ప్రతిరోజు సగటున 82 మొబైల్‌లను రికవరీ చేస్తున్నారు.

ప్రధాన మైలురాళ్లు

* 10,000 మొబైల్‌లు: 189 రోజుల్లో
* 20,000 మొబైల్‌లు: 291 రోజుల్లో
* 30,000 మొబైల్‌లు: 395 రోజుల్లో
* 37,000 మొబైల్‌లు: 459 రోజుల్లో

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో (3808) తరువాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో (2174) మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో (2030) మొబైళ్లను రికవరీ చేశారు.

తెలంగాణ పౌరులకు మరింత సులభంగా మరియు మెరుగుగా సేవలు అందించడానికి, తెలంగాణ పోలీసులు టెలికాం శాఖ (డివోటి) తో కలిసి సీఈఐ ఆర్ పోర్టల్‌ను తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌తో అనుసంధానించారు. పోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ పరికరాల గురించి రిపోర్ట్ చేయడానికి ప్రజలు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్‌సైట్‌లకు వెళ్లాలి.

Samsung Galaxy A06 : శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లు లీక్..!