Unearthed Wonders: గుంతను తొవ్విన మహిళలు.. అందులో హారాలు, బంగారు లాకెట్లు, పతకాలు, ఉంగరాలు, చెవిపోగులు.. ఇంకా ఎన్నో..

బయటపడిన విలువైన వస్తువులు ఏ కాలం నాటివి? వాటి మూలాలను గుర్తించాలని..

Unearthed Wonders: గుంతను తొవ్విన మహిళలు.. అందులో హారాలు, బంగారు లాకెట్లు, పతకాలు, ఉంగరాలు, చెవిపోగులు.. ఇంకా ఎన్నో..

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు, తదితర ప్రక్రియను చేపడుతున్నారు. ఓ వైపు పూరీలో అన్ని ఆభరణాలు బయటపడగా, మరోవైపు కేరళలో కొందరు కూలీలకు బంగారం, వెండితో చేసిన కళాకండాలు దొరికాయి.

కేరళలోని కన్నూర్ జిల్లా చెంగలిలో పరిప్పాయి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల సమీపంలోని రబ్బరు తోటలో వర్షం నీటిని సేకరించేందుకు కొందరు మహిళా కూలీలు ఒక మీటరు లోతు గుంతను తవ్వారు. అక్కడ వారికి బంగారం, వెండితో కూడిన కంటైనర్ వంటిది కనిపించింది.

అయితే, అది మందుపాతర అని భయపడిన కార్మికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ఎంవీ షీజు పోలీసు బృందం కంటైనర్‌ను తెరిచి స్వాధీనం చేసుకుంది. వాటిలో 17 ముత్యాల హారాలు, 13 బంగారు లాకెట్లు, నాలుగు పతకాలు, ఐదు పురాతన ఉంగరాలు, చెవిపోగులు, అనేక వెండి నాణేలు ఉన్నాయి.

అనంతరం వాటిని కోర్టులో హాజరుపరిచారు. తొవ్వకాలలో బయటపడిన విలువైన వస్తువులు ఏ కాలం నాటివి? వాటి మూలాలను గుర్తించాలని పురావస్తు శాఖను కోర్టు ఆదేశించింది. పురావస్తు శాఖ తవ్వకాలలో దొరికిన వాటిని పరిశీలించి కంటైనర్ ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటారు. అవి చాలా పాతవని ప్రాథమికంగా అంచనా వేశారు.