IND vs SL : శ్రీలంక‌తో సిరీస్‌కు ముందే టీమ్ఇండియాకు షాక్‌.. వ‌న్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్ దూరం..!

భార‌త జ‌ట్టు ఈ నెలాఖ‌రులో శ్రీలంక‌లో ప‌ర్య‌టించ‌నుంది.

IND vs SL : శ్రీలంక‌తో సిరీస్‌కు ముందే టీమ్ఇండియాకు షాక్‌.. వ‌న్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్ దూరం..!

PIC credit : BCCI

India vs Sri Lanka : భార‌త జ‌ట్టు ఈ నెలాఖ‌రులో శ్రీలంక‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌లో ఆతిథ్య లంక‌తో భార‌త్ మూడు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్ ఆడ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌తోనే కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టనున్నాడు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న ముందు టీమ్ఇండియాకు షాక్ త‌గిలింది. లంక‌తో వ‌న్డే సిరీస్‌కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో పాండ్యా ఈ సిరీస్‌కు దూరం అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే బీసీసీఐకి హార్దిక్ తెలియ‌జేశాడ‌ని, ఇందుకు బీసీసీఐ కూడా ఒకే చెప్పింద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

లంక‌తో వన్డే సిరీస్‌కు దూర‌మైన‌ప్ప‌టికి టీ20 సిరీస్‌కు మాత్రం హార్దిక్ అందుబాటులో ఉండ‌నున్నాడు. టీ20ల‌కు రోహిత్ శ‌ర్మ గుడ్ బై చెప్ప‌డంతో హార్దిక్ సార‌థ్యంలోనే భార‌త్ పొట్టి ఫార్మాట్‌లో బ‌రిలోకి దిగ‌నుంది. ఇక వ‌న్డే సిరీస్‌కు రోహిత్‌, కోహ్లిల‌కు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్య కూడా వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకోవ‌డంతో కేఎల్ రాహుల్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించే అవ‌కాశం ఉంది.

Virat Kohli : టీమ్ఇండియా స్పిన్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కెప్టెన్ అయ్యాక కోహ్లి మారిపోయాడు.. రోహిత్ అయితే..

జూలై 27 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుండ‌గా, ఆగ‌స్టు 2 నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది.

భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ షెడ్యూల్..

టీ20 సిరీస్..
తొలి టీ20 – జూలై 27న‌
రెండ‌ టీ20 – జూలై 28న‌
మూడో టీ20 – జూలై 30న

వన్డే సిరీస్..
తొలి వ‌న్డే – ఆగస్టు 2న‌
రెండో వన్డే – ఆగస్టు 4న‌
మూడో వ‌న్డే – ఆగస్టు 7న‌

Brian Lara : బ్రియాన్ లారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నేను, స‌చిన్ కూడా ఆ ప్లేయ‌ర్ ప్ర‌తిభ‌కు ద‌గ్గ‌ర‌గా రాలేదు..

టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచులు భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌లకు ప్రారంభం కానున్నాయి. వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు అన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జ‌ర‌గ‌నున్నాయి.