కన్వర్ యాత్ర 2024: శ్రావణమాసంలో శివనామస్మరణతో నడక.. 15 రోజుల పాటు పరమ పవిత్రంగా కార్యక్రమం

కన్వర్ యాత్ర చేసే భక్తులు కేవలం కాలినడకనే ప్రయాణించాలి. యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మాంసం, మద్యం తీసుకోకుండా.. శాఖాహారమే తీసుకోవాలి.

కన్వర్ యాత్ర 2024: శ్రావణమాసంలో శివనామస్మరణతో నడక.. 15 రోజుల పాటు పరమ పవిత్రంగా కార్యక్రమం

Kanwar Yatra 2024 date route and mportance of Kanwar Yatra

Kanwar Yatra 2024 date and routes: శ్రావణమాసం అంటేనే హిందువులకు పరమపవిత్రం. ఈ మాసంలో చాలామంది ప్రతిరోజు ఒక్కపూట భోజనం చేసి తర్వాత ఉపవాసం ఉంటుంటారు. ప్రత్యేక నియమాలతో పూజలు చేసేవాళ్లు ఉన్నారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా శ్రావణమాసం పూజలు, యాత్రలు, జాతరలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా యూపీలో జరిగే యాత్రే కన్వర్ యాత్ర. దీనికి చాలా ప్రత్యేకమైన నియమనిష్టలు ఉన్నాయి. కన్వర్ యాత్ర నాలుగు రకాలుగా ఉంటుంది. సాధారణ కన్వర్, డక్ కన్వార్, దండి కన్వార్, స్టాండింగ్ కన్వార్ అని ఉంటారు.

శాఖాహారమే తీసుకోవాలి
కన్వర్ యాత్ర చేసే భక్తులు కేవలం కాలినడకనే ప్రయాణించాలి. యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మాంసం, మద్యం తీసుకోకుండా.. శాఖాహారమే తీసుకోవాలి. విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా కావడిని నేలపై దించొద్దు. కావడి మోస్తూ నడుస్తున్నంత సేపు శివనామస్మరణ జపిస్తూ ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తూ కన్వర్ యాత్ర చేస్తుంటారు భక్తులు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు కాషాయ రంగు వస్త్రాలు ధరిస్తారు. భక్తి, విశ్వాసంతో దేవుడి మీద మనసు పెట్టి.. కేవలం భగవంతుడి నామం స్మరించుకుంటూ యాత్ర చేస్తే ఆ భోలేనాథుడి ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతుంటారు.

కావడిని భుజంపై మోస్తూ..
శివభక్తులు చాలా ఇష్టంతో భక్తిశ్రద్దలతో కన్వర్ యాత్ర చేస్తుంటారు. శ్రావణ మాసంలో మొదటి రోజు నుంచి పదిహేను రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా భక్తులు వెదురుతో శివుడి కోసం పల్లకిలు, తొట్లేల మాదిరిగా పల్లకీలు చేసి.. శివుడి ఫోటోపెట్టుకుని భుజంపై మోస్తూ యాత్ర చేస్తుంటారు. ప్రసిధ్ది చెందిన గంగానది ప్రవహించే పుణ్యస్థలాలకు నడుచుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత గంగా నదీ నుంచి జలాన్ని తీసుకుని శివుడికి అభిషేకం చేస్తుంటారు. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతుంటారు. వందల ఏళ్లుగా ప్రతి ఏడాది ఈ పవిత్రమైన యాత్ర కొనసాగుతూనే ఉంది. కావడితో తీసుకొచ్చిన గంగా జలాన్ని శివలింగానికి సమర్పిస్తే తమ కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.

Also Read: కన్వర్ యాత్ర చుట్టూ కాంట్రవర్సీలు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేమ్ బోర్డు ఇష్యూ

ఉత్తరాది రాష్ట్రాల్లో భక్తులు ఈ కన్వర్ యాత్రను ఎక్కువగా చేస్తుంటారు. శ్రావణం అంటే శివుడికి ఇష్టమైన మాసంగా చెబుతుంటారు. ఈ మాసంలో శివుడికి గంగాజలాన్ని సమర్పిస్తే ప్రసన్నుడవుతాడని నమ్ముతారు. శివభక్తులు భగవంతుడి అనుగ్రహం పొందటం కోసం ఈ మాసంలో కన్వర్ యాత్రను చేస్తారు. రాముడు, పరశురాముడు, రావణుడితో సహ ఎంతో మంది కన్వర్ యాత్ర చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

Also Read: ఇలాంటి నాన్న ఉంటే.. పిల్లలు ఏదైనా సాధించగలరు.. ఈ అమ్మాయే రుజువు!

ముఖ్యంగా.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, గౌముఖ, గంగోత్రి వంటి ప్రాంతాల నుంచి గంగా జలాన్ని తీసుకువస్తారు. ఈ ఏడాది జులై 22న ప్రారంభమై ఆగస్ట్ 6న ముగుస్తుంది కన్వర్ యాత్ర. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కన్వర్ యాత్రకు పెద్దఎత్తున అరేంజ్‌మెంట్స్ జరిగాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.