TTD Srivani Tickets : ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా రోజుకు 1000 మాత్రమే

TTD Srivani Tickets : జూలై 22 నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందిస్తున్న 500 శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను టీటీడీ కొనసాగించనుంది.

TTD Srivani Tickets : ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా రోజుకు 1000 మాత్రమే

TTD Reduced Srivani Tickets per day 1k only ( Image Source : Google )

Updated On : July 18, 2024 / 9:17 PM IST

TTD Srivani Tickets : తిరుమల దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో టీటీడీ దర్శన టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి సామాన్య భక్తుల కోసం శ్రీవాణి టికెట్లపై టీటీడీ చర్యలు చేపట్టింది. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది. ఇది జూలై 22 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందిస్తున్న 500 శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను టీటీడీ కొనసాగించనుంది.

శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనానికి టీటీడీ ప్రాధాన్యత పెంచింది. ఆన్‌లైన్‌లో ఏ మార్పు లేకుండా 500, ఆఫ్‌లైన్‌లో 1000 టికెట్లు మాత్రమే జారీ చేయనుంది. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి ముందు ప్రాతిపదికగా టీటీడీ జారీ చేయనుంది.

మరో 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో అందుబాటులో ఉంచనుంది. బోర్డింగ్‌ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్‌ టికెట్లను జారీ చేయనుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇది గమనించాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also : TTD Tickets : ఆ వార్తలు అవాస్తవం.. శ్రీవారి దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు : టీటీడీ