Gold Price Today : మరోసారి భారీగా పతనమైన బంగారం ధర.. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో గురువారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
![Gold Price Today : మరోసారి భారీగా పతనమైన బంగారం ధర.. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా? Gold Price Today : మరోసారి భారీగా పతనమైన బంగారం ధర.. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?](https://10tv.in/wp-content/uploads/2024/07/Gold-And-Silver-Price-Today-12.jpg)
Gold And Silver Price Today
Gold and Silver Price Today : మీరు బంగారం కొనుగోలు చేస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ తో బంగారం ధర దిగొస్తుంది. మొన్నటి వరకు సామాన్యులకు కొనుగోలు చేయలేని స్థాయికి చేరుకున్న బంగారం ధర ప్రస్తుతం దిగొస్తుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,040 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 950 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గుతూ వస్తోంది. గత వారం రోజుల క్రితం వరకు రూ. లక్ష వరకు చేరిన కిలో వెండి ధర ప్రస్తుతం రూ.80వేలకు చేరుకుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. ఈ నెలాఖరు వరకు బంగారం, వెండి ధరల్లో భారీగా తగ్గుదల చోటుచేసుకోవటం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో గురువారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.69,820 - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,150 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,950.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,000 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,820.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,300 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,150కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా గురువారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 89,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.89,000.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.84,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.