Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో పత‌కం.. చరిత్ర సృష్టించిన మ‌ను భాక‌ర్‌..

పారిస్ ఒలింపిక్స్‌2024లో భారత్ ఖాతాలో మ‌రో ప‌త‌కం వ‌చ్చి చేరింది.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో పత‌కం.. చరిత్ర సృష్టించిన మ‌ను భాక‌ర్‌..

Manu Bhaker scripts history at Paris Olympics wins bronze with Sarabjot Singh

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌2024లో భారత్ ఖాతాలో మ‌రో ప‌త‌కం వ‌చ్చి చేరింది. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌- మను బాకర్‌ జోడీ కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా జోడీ వోన్హో లీ- యే జిన్ ఓహ్ పై జంట‌పై 16-10 తేడాతో గెలుపొందింది.

ఈ క్ర‌మంలో మ‌ను భాక‌ర్ చ‌రిత్ర సృష్టించింది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఆదివారం వ్య‌క్తిగ‌త విభాగం 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్‌లో మ‌ను భాక‌ర్ కాంస్య ప‌త‌కాన్ని గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

IND vs SL : శ్రీలంక‌తో మూడో టీ20కి ముందు.. భార‌త్‌కు గట్టి ఎదురుదెబ్బ‌..

1900 ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలు గెలిచాడు. బ్రిటీష్‌-ఇండియన్ అథ్లెట్‌ అయిన ప్రిచర్డ్.. ఆ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి తర్వాత ఏ భారత అథ్లెట్ ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేదు.

ఇదిలా ఉంటే.. కెరీర్‌లో మాత్రం ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఇద్దరు ఉన్నారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకంను రెజ్లర్ సుశీల్ సాధించాడు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది.

MS Dhoni : ఈ కండిష‌న్‌కు బీసీసీఐ ఓకే అంటేనే.. ఐపీఎల్ 2025లో ధోని ఆడేది..?