Video: ఈ టాలెంట్ కూడా ఉందా? వయోలిన్‌తో జాతీయ గీతాన్ని ప్లే చేసిన ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్‌

పారిస్ ఒలింపిక్స్‌ 2024కు నాలుగు నెలల ముందే ఆమె మ్యూజిక్ క్లాస్ వెళ్లి వయోలిన్ నేర్చుకుంది.

Video: ఈ టాలెంట్ కూడా ఉందా? వయోలిన్‌తో జాతీయ గీతాన్ని ప్లే చేసిన ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్‌

Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మను భాకర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇందులో మను భాకర్ వయోలిన్‌‌తో జాతీయ గీతాన్ని ప్లే చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో షూటింగ్ అకాడమీలో ఆమె వయోలిన్ ప్లే చేసింది. స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చొని, రెడ్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో మను భాకర్ కనపడింది. ఈ ఏడాది మేలో ఈ వీడియో తీసినట్లు స్పోర్ట్స్‌స్టార్ మీడియా తెలిపింది. మను భాకర్ కి ఆమె సోదరుడు ఈ వయోలిన్‌ను బహుమతిగా ఇచ్చాడు.

పారిస్ ఒలింపిక్స్‌ 2024కు నాలుగు నెలల ముందే ఆమె మ్యూజిక్ క్లాస్ వెళ్లి వయోలిన్ నేర్చుకుంది. షూటింగ్, ఆర్చరీ వంటి క్రీడల్లో రాణించాలంటే ఏకాగ్రత, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఆమె వయోలిన్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారు అందరూ మ్యాచ్‌కి సిద్ధమవుతోంటే మను మాత్రం వయోలిన్ వాయిస్తోందని ఆ సమయంలో ఆమె కోచ్ జస్పాల్ రానా చెప్పారు.

Also Read: ఏంటి అన్న‌యా ఇదీ.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా..? టీ20 అనుకున్న‌వా..? అంత తొంద‌రేంది..?