వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది- మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.

వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది- మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Minister Ramprasad Reddy : వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని చెప్పారు. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని తెలిపారు. వైసీపీ నేతల భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

”పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్స్ కాల్చివేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. అనేకమంది బాధితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసిన భూ దోపిడీపై ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రజలను భయపెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దఎత్తున దోపిడీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో 40 వేల కోట్ల రూపాయల భూ అక్రమాలు జరిగాయి.

భద్రత కోసం కూడా పెద్దిరెడ్డి కుటుంబం చిల్లర రాజకీయాలు చేస్తోంది. కావాలనే దాడుల సృష్టించుకొని, పోలీసుల వైఫ్యలం పేరుతో డ్రామా ఆడుతున్నారు. 60 రోజుల నుంచి రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మదనపల్లి ఘటనపై జగన్ తో చర్చకు మేము సిద్ధం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల గన్ మెన్లను తొలగించారు. ఆగస్టు 7న రవాణశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేస్తారు” అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Also Read : కళా వెంకటరావు కుటుంబం రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో సందేహాలు? ఎందుకీ పరిస్థితి?