Zomato Instant Balance : జొమాటో ఇన్‌స్టంట్ బ్యాలెన్స్ ఫీచర్‌.. ఇదేంటి? కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి?

Zomato Instant Balance : భవిష్యత్తులో ఉపయోగానికి కస్టమర్ జొమాటో మనీ అకౌంట్‌‌కు తక్షణమే బ్యాలెన్స్ మొత్తాన్ని క్రెడిట్ చేసే అవకాశం ఉందని ప్రకటించారు.

Zomato Instant Balance : జొమాటో ఇన్‌స్టంట్ బ్యాలెన్స్ ఫీచర్‌.. ఇదేంటి? కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి?

Zomato announces Instant Balance feature ( Image Source : Google )

Zomato Instant Balance : ప్రముఖ ఫుడ్ డెలివరీ, డైనింగ్ అవుట్ ప్లాట్‌ఫారమ్ జొమాటో కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. కస్టమర్ల కోసం జొమాటో ఇప్పుడు ఆర్డర్‌ల కోసం క్యాష్ పేమెంట్స్ కూడా అనుమతిస్తుంది. దీనిపై కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఉపయోగానికి కస్టమర్ జొమాటో మనీ అకౌంట్‌‌కు తక్షణమే బ్యాలెన్స్ మొత్తాన్ని క్రెడిట్ చేసే అవకాశం ఉందని ప్రకటించారు.

Read Also : Hyderabad Residential Market : రియాల్టీలో హైదరాబాద్ జోరు.. దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌ : నైట్ ఫ్రాంక్ ఇండియా

“క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌ల కోసం కచ్చితమైన మార్పును కనుగొనడం కొన్నిసార్లు అసౌకర్యంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మా కస్టమర్‌లు డెలివరీ పార్టనర్లకు క్యాష్ రూపంలో చెల్లించవచ్చు. బ్యాలెన్స్ మొత్తాన్ని వారి జొమాటో మనీ అకౌంటుకు తక్షణమే యాడ్ చేయమని అడగవచ్చు.

డెలివరీ సమయంలో ఈ క్రెడిట్ మొత్తాన్ని వాడొచ్చు :
ఈ బ్యాలెన్స్ భవిష్యత్తులో డెలివరీ సమయంలో ఆర్డర్లు లేదా డైనింగ్ అవుట్ కోసం ఉపయోగించవచ్చు ” అని గోయల్ పేర్కొన్నారు. నగదు లావాదేవీల సమయంలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించడానికి ఈ కొత్త ఫీచర్ రూపొందించింది. జొమాటో మనీ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తాన్ని నేరుగా క్రెడిట్ చేయడం ద్వారా ప్లాట్‌ఫారమ్ కస్టమర్‌లకు అవాంతరాలను నివారిస్తుంది.

ఈ క్రెడిట్ మొత్తాన్ని రాబోయే ఏదైనా డెలివరీ ఆర్డర్‌లు లేదా డైనింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ఒక ముఖ్యమైన ముందడుగు అయినప్పటికీ, జొమాటో బ్యాలెన్స్ అమౌంట్ వినియోగానికి కాల పరిమితిని విధిస్తుందో లేదో చూడాలి. రానున్న కాలంలో దీనిపై ఫుల్ క్లారిటీ వస్తుంది.

అంతేకాకుండా, స్విగ్గీ, జొమాటో, బిగ్‌బాస్కెట్ వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు త్వరలో బీర్, వైన్, లిక్కర్‌ల వంటి తక్కువ ఆల్కహాల్ పానీయాలను డెలివరీ చేయవచ్చని ఇటీవల నివేదించింది. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ సహా పలు రాష్ట్రాలు ఈ చొరవకు పైలట్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాయని పరిశ్రమ అధికారులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నారని వెల్లడించారు.

స్విగ్గీ బాటలో జొమాటో :
2020లో స్విగ్గీ, జొమాటో కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తమ సేవలను వైవిధ్యపరచడానికి మెట్రోయేతర ప్రాంతాల్లో ఆన్‌లైన్ ఆల్కహాల్ డెలివరీని ప్రారంభించాయి. జార్ఖండ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత స్విగ్గీ కూడా ఆల్కహాల్ డెలివరీ సర్వీసును రాంచీలో ప్రారంభించింది.

జొమాటో కూడా అదే బాటలో నడిచి రాంచీలో ఆల్కహాల్ డెలివరీ సర్వీసును ప్రారంభించింది. ఆ తర్వాత జార్ఖండ్‌లోని మరో ఏడు నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. ఆ సమయంలో, రెండు కంపెనీలు కూడా తమ సేవలను పొడిగించడానికి ప్రధాన మెట్రోలలోని అధికారులతో చర్చలు జరుపుతున్నాయి. అయితే, అనుమతులు కొన్ని వారాల నుంచి ఒక నెల వరకు పట్టవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!