ఏ ఆపదొచ్చినా అండగా ఉంటాం.. మిత్రదేశాలతో సన్నిహితంగా ఉండటమే భారత్ లక్ష్యం

మిత్రదేశాలు మనతో ఎలా ప్రవర్తించినా భారత్ మాత్రం స్నేహహస్తమే ఇస్తోంది. నేపాల్ అయినా శ్రీలంక అయినా మాల్దీవులు అయినా అందరికీ సాయం చేస్తుంది. నిజమైన ఫ్రెండ్షిప్‌కు అర్థమేంటో చేతల్లో చూపిస్తోంది.

ఏ ఆపదొచ్చినా అండగా ఉంటాం.. మిత్రదేశాలతో సన్నిహితంగా ఉండటమే భారత్ లక్ష్యం

Why India continue friendship with neighbouring countries explained here

India continue friendship : మన్నలి కాదనుకున్నప్పుడు.. హర్ట్ అయ్యేలా కించపరిచినప్పుడు ఎంత మంచి మిత్రువునైనా కొన్నిసార్లు వదులుకోక తప్పదు. కానీ మిత్రదేశాలు మనతో ఎలా ప్రవర్తించినా భారత్ మాత్రం స్నేహహస్తమే ఇస్తోంది. నేపాల్ అయినా శ్రీలంక అయినా మాల్దీవులు అయినా అందరికీ సాయం చేస్తుంది. అప్పుడప్పుడు చైనా మాటలు విని మన మిత్రదేశాలు సహనం కోల్పోతున్నాయి. కొన్నిసార్లు అయితే భారత్‌తో గొడవ పెట్టుకోవడానికి కూడా కాలుదువ్వుతున్నాయి. కానీ ఇండియా మాత్రం ఓపిక, సహనమే పెట్టుబడిగా ఉంటోంది. మన మిత్రదేశాల విషయంలో ఎప్పుడూ దూకుడు ప్రదర్శించడం లేదు భారత్. నిజమైన ఫ్రెండ్షిప్‌కు అర్థమేంటో చేతల్లో చూపిస్తోంది.

అటు డ్రాగన్.. ఇటు మనం
తొమ్మిది దేశాలతో భారత్ సరిహద్దు పంచుకుంటోంది. అందులో పాకిస్థాన్ ఒక్కటే మనకు శత్రుదేశంగా ఉంటోంది. చైనా అప్పుడప్పుడు కవ్విస్తున్నా అటు డ్రాగన్.. ఇటు మనం ఇద్దరం పూర్తిస్థాయి దుష్మనీ కోరుకోవడం లేదు. ఇక నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, అప్ఘనిస్థాన్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌ మనతో సన్నిహతంగానే ఉంటూ వస్తున్నాయి. ఇందులో కొన్ని దేశాలు అప్పుడప్పుడు మన శత్రువులు ఆడే నాటకంలో పావులుగా మారి బలవుతున్నాయి. చైనా అయినా, పాక్ అయినా రెచ్చగొట్టి మనతో గొడవ పెట్టుకునేలా పొరుగున ఉన్న దేశాలను గెలుకుతున్నాయి. మాల్దీవులు అయితే చైనా మాటలు విని.. భారత్‌తో బంధం తెంచుకునేంత వరకు వెళ్లింది. భారత్ మాత్రం మాల్దీవులను ఎప్పుడూ శత్రుదేశంగా చూడలేదు. మాల్దీవులు పర్యాటకరంగ ఇన్‌కమ్ సోర్స్‌ మన టూరిస్టుల మీద ఆధారపడి ఉంటుంది. అది తెలిసి కూడా మాల్దీవులు ప్రెసిడెంట్ ముయిజ్జు భారత్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. దాంతో ప్రధాని మోదీ వెళ్లి లక్షద్వీప్‌లో కూర్చుంటే చాలు మాల్దీవులు టూరిజం ఢమాల్ అయిపోయింది. చైనా మాటలు విని ఆగమైపోయింది మాల్దీవులు. అయినా ఆ దేశానికి నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది భారత్. డైలాగ్‌వార్ కంటిన్యూ అవుతూ ఉన్నా బియ్యం, గోధుమ పిండి, ఉల్లిగడ్డ సప్లైని మాత్రం ఆపలేదు.

మాల్దీవులుకు సాయం
మాల్దీవులుకు మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడైన తర్వాత.. ఆ దేశం చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తోంది. భారత్‌ని కాదని ముయిజ్జు తన తొలి పర్యటన చైనాలో చేశారు. చైనాతో ఒప్పందాలు చేసుకున్నారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ముయిజ్జు ప్రభుత్వంలోని మంత్రులు ప్రధాని నరేంద్రమోడీపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. అయినా మాల్దీవులుకు ఇచ్చిన 4 వందల కోట్ల రుణం చెల్లింపు గడువును ఏడాది పెంచింది భారత్. మాల్దీవులు మంత్రులు భారత్‌ అందించిన సాయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది మాల్దీవులు, భారత్ మధ్య చిరకాల స్నేహాన్ని సూచించే నిజమైన సంకేతమని కొనియాడారు.

భారత్‌, నేపాల్ సంబంధాల్లో మార్పులు
భారత్‌-నేపాల్‌ మధ్య సంబంధాలు చాలా పటిష్టంగా ఉండేవి. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ బాధత్యలు చేపట్టినప్పటి నుంచి.. భారత్‌, నేపాల్ సంబంధాల్లో మార్పులు వచ్చాయి. భారత్‌తో శతాబ్దాల అనుబంధాన్ని పక్కనబెట్టి.. హిమాలయ రాజ్యం నేపాల్ రెచ్చగొట్టే చర్యలకు తెరలేపుతోంది. చైనాకు అనుకూలంగా ఉండే ప్రధాని ఓలీ.. తనను పదవి నుంచి దించడానికి భారత్‌ కుట్రలు చేస్తుందని విమర్శలు చేశారు. ఇలా చైనాతో దోస్తీ చేస్తూ భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది నేపాల్. నాలుగేళ్ల కిందట ఉత్తరాఖండ్‌లోని భూభాగాలు తమవేనంటూ నేపాల్ ఓ మ్యాప్‌ను రూపొందించి కాంట్రవర్సీకి తెరలేపింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. అయినా సరే నేపాల్ తన తీరును సమర్దించుకుంది. అదే మ్యాప్‌ను తన కరెన్సీ నోటుపై ముద్రించేందుకు రెడీ అయింది. ఇంత చేసినా భూకంపం సమయంలో నేపాల్‌కు భారీ సాయం చేసింది భారత్. 8 జిల్లాల్లోని 71 విద్యాసంస్థలను నిర్మించేందుకు 50 మిలియన్అమెరికా డాలర్లు అందించింది.

చైనా పాటనేపాడుతోన్న శ్రీలంక
ఇక ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భరోసా కల్పిస్తూ వచ్చింది భారత్. ఆర్థిక సాయం చేయడంతో పాటు రుణాలు, ఉచితంగా ఆహార పదార్థాలు సరఫరా చేసి అండగా నిలిచింది. అయితే భారత్‌పై నిఘా పెట్టేందుకు చైనా శ్రీలంకను పావుగా వాడుకుంటోంది. ఇప్పటికే శ్రీలంకకు ఇచ్చిన అప్పులకు బదులుగా ఆ దేశం హంబన్‌టోట పోర్ట్‌ను డ్రాగన్ కంట్రీ లీజుకు ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయడేందుఉ భారత్ భారీగా సాయం చేసినప్పటికీ, ఈ విషయాన్ని మరిచిపోయి శ్రీలంక మళ్లీ చైనా పాటనే పాడుతోంది. అయినా శ్రీలంక విషయంలో పాజిటివ్‌గానే ఉంది భారత్.

మయన్మార్‌కు అండగా భారత్
సైన్యంపై దాడులు, ప్రజల తిరుగుబాటుతో మయన్మార్ కూడా ఆగమాగం అయింది. మయన్మార్‌కు కూడా అండగా నిలిచింది భారత్. ఆ దేశంలో ఉన్న పరిస్థితులతో శరణార్థులు మిజోరాంలోకి వచ్చినా అభ్యంతరం చెప్పలేదు భారత్. మయన్మార్ నుంచి వచ్చిన జనాలకు కనీస అవసరాలు కల్పించింది మిజోరాం ప్రభుత్వం. మయన్మార్ సైనికులు కూడా మనదేశంలో తలదాచుకున్నారు. అన్నింటికి ఓర్చుకుని ఆపద సమయంలో ఆదుకునే ప్రయత్నం చేసింది భారత్.

భూటాన్ అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో పదివేల కోట్ల సాయం అందించనుంది భారత్. విడతల వారీగా ఇప్పటికే వెయ్యి కోట్లు సాయం చేసింది. గ్యాల్‌సంగ్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి పెద్దమొత్తంలో ఆర్థిక సహకారం చేస్తుంది ఇండియా. ఇక 2022లో అఫ్ఘనిస్థాన్కు భారత్ ఆపన్న హస్తం అందించింది. భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘన్కు.. పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించింది.

చెడును మంచితో తిప్పికొడుతోంది భారత్. పాక్, చైనా కుట్రలకు ఓపిక, సహనంతో సమాధానం చెప్తోంది భారత్. ద్వైపాక్షిక సంబంధాలు, స్నేహాన్ని కంటిన్యూ చేసేందుకు అవసరమైన ప్రతీ సందర్భంలో మిత్ర దేశాలకు అండగా నిలుస్తూ వస్తోంది. ఇంత చేసినా మన సాయం పొందుతూనే కొన్ని సందర్భాల్లో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి మన పొరుగులు దేశాలు.