Sobhita – Samanth : 2022 నుంచి శోభితతో నాగచైతన్య లవ్.. శోభిత సిస్టర్ ‘సమంత’ పోస్ట్ వైరల్..

గత రెండు రోజులుగా శోభిత నాగచైతన్య జంట, వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Sobhita – Samanth : 2022 నుంచి శోభితతో నాగచైతన్య లవ్.. శోభిత సిస్టర్ ‘సమంత’ పోస్ట్ వైరల్..

Samantha Sensational Post on Naga Chaitanya Sobhita Love Photos goes Viral

Updated On : August 10, 2024 / 3:34 PM IST

Sobhita – Samanth : నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఇటీవల రెండు రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ జంట, వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇంకో రెండు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Committee Kurrollu : నిహారిక నిర్మాత‌గా ఫ‌స్ట్ సినిమా.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంతంటే..?

శోభిత ధూళిపాళకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి పేరు కూడా సమంతనే అని తెలియడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. శోభిత చెల్లి సమంత డాక్టర్ గా పనిచేస్తుంది. ఆల్రెడీ ఆమెకు పెళ్లి అయింది. తాజాగా నాగచైతన్య – శోభిత నిశ్చితార్థం ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికర విషయం తెలిపింది. సమంత ధూళిపాళ నిశ్చితార్థం ఫొటోలు పోస్ట్ చేసి 2022 నుంచి ఎప్పటికి.. అని పోస్ట్ చేసింది. దీంతో వీళ్ళిద్దరూ 2022 నుంచి లవ్ లో ఉన్నారు అని డైరెక్ట్ గానే చెప్పేసింది. ఈ విషయం తెలిసి ఇప్పుడు ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Samanta Dhulipala (@dr.samantad)

నాగ చైతన్య – సమంత 2021లో విడాకులు తీసుకున్నారు. 2022 నుంచి చైతన్య – శోభిత లవ్ లో ఉన్నారు అని శోభిత చెల్లి సమంత చెప్పడం, నాగ చైతన్య మాజీ భార్య పేరు సమంత, శోభిత చెల్లి పేరు కూడా సమంత అవ్వడంతో ఈ వార్త వైరల్ గా మారింది. శోభిత చెల్లి సమంతని మీరు కూడా చూసేయండి..