Manish sisodia : బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మనీశ్ సిసోడియా.. ప్రజలకు కీలక విజ్ఞప్తి

బీజేపీకి ఓకేఒక్క నైపుణ్యం ఉంది. అదేమిటంటే.. ఇతర పార్టీల్లోని నాయకులను విడగొట్టి, రకరకాల శిక్షలతో జైళ్లకు పంపించడం. వారిపై మానసికంగా దాడి చేయడం.

Manish sisodia : బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మనీశ్ సిసోడియా.. ప్రజలకు కీలక విజ్ఞప్తి

Manish sisodia

Updated On : August 10, 2024 / 1:17 PM IST

Manish sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈసీ, సీబీఐ కేసుల్లో గత 17నెలలుగా తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన   జైలు నుంచి విడుదలయ్యారు. కాగా శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయంకు వచ్చారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో కార్యాలయంకు వచ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి సిసోడియా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అన్ని శక్తులు ఏకతాటిపైకి వచ్చినా సత్యాన్ని ఓడించలేవు అని అన్నారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : నా భార్యతో అనుక్షణం నరకం అనుభవించాను.. ఇక నా వల్ల కాదు: దువ్వాడ శ్రీనివాస్

బజరంగబలి దయ వల్ల నేను 17నెలల తరువాత విడుదలయ్యాను. ఏడు ఎనిమిది నెలల్లో జైలు నుంచి బయటకు వస్తానని భావించాను.. కానీ ఆలస్యమైందని అన్నారు. విజయానికి ఒకేఒక మంత్రం ఉంది. ఢిల్లీలోని ప్రతి చిన్నారికి అద్భుతమైన పాఠశాలను నిర్మించాలి. మేము రథానికి గుర్రాలం. మన నిజమైన రథసారధి జైలులో ఉన్నాడు. అతను బయటకు వస్తాడు. జైలు తాళాలు పగలగొట్టి కేజ్రీవాల్ ను విడుదల చేస్తారని సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఒక్క రాష్ట్రంలో కూడా నిజాయితీగా పనులు జరుగుతున్నాయని నిరూపించుకోలేక పోయిందని సిసోడియా విమర్శించారు. తీవ్రవాదులు, డ్రగ్స్ మాఫియాపై విధించాల్సినటువంటి సెక్షన్లను నాపై, సంజయ్ సింగ్ పై విధించడానికి వారు ప్రయత్నించారు. తద్వారా జీవితకాలం జైలులో ఉంచాలని వారు చూశారని అన్నారు.

Also Read : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీకి ఓకేఒక్క నైపుణ్యం ఉంది. అదేమిటంటే.. ఇతర పార్టీల్లోని నాయకులను విడగొట్టి, రకరకాల శిక్షలతో జైళ్లకు పంపించడం. వారిపై మానసికంగా దాడి చేయడం. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది ఆప్ కార్యకర్తలే కాదు.. ఆ బాధ్యత దేశంలోని ప్రతి సామాన్యుడిది. బీజేపీ కుట్రలను గ్రహించి ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి చేశారు.