Aditya Tiwari : వావ్.. ఈ బుడ్డోడు చేస్తున్న పనికి సెల్యూట్ చేయాల్సిందే.. వీడియోలు చూస్తే ఫిదా అవుతారు

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన ఆదిత్య తివారికి పదేళ్ల వయస్సు. అతడు గత మూడేళ్ల నుంచి ట్రాఫిక్ పోలీసులతో కలిసి ..

Aditya Tiwari : వావ్.. ఈ బుడ్డోడు చేస్తున్న పనికి సెల్యూట్ చేయాల్సిందే.. వీడియోలు చూస్తే ఫిదా అవుతారు

Aditya Tiwari

Aditya Tiwari Spreads Awareness About the Traffic Rules : చిన్నతనంలో ఎవరైనా చదువులు, ఆటల మీద శ్రద్దచూపుతారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతూ అల్లరి పనులు చేస్తుంటారు. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన ఓ బుడ్డోడు పదేళ్ల వయస్సులోనే ప్రజలచేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. స్థానిక ట్రాఫిక్ పోలీసులు అయితే ఆ బుడ్డోడికి ‘ట్రాఫిక్ సోల్జర్ ఆఫ్ ఇండియా’ అని పేరు కూడా పెట్టారు. ఇంతకీ ఆ పదేళ్ల బడ్డోడు చేస్తున్న పని ఏమిటి.. ప్రజల ఎందుకు అంతలా మెచ్చుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం..

Also Read : Samit Dravid : ఓరీ నాయ‌నో.. రాహుల్ ద్ర‌విడ్ కొడుకు కొట్టిన భారీ సిక్స‌ర్ చూశారా..?

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన ఆదిత్య తివారికి పదేళ్ల వయస్సు. తన చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్ అవగాహన పెంచుకున్నాడు. అంతేకాదు.. ట్రాఫిక్ రూల్స్ పై తాను సొంతంగా కంపోజ్ చేసిన పాటలు పడుతూ ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి అవగాహన కల్పిస్తుండేవాడు. గత మూడేళ్లుగా వీలుచిక్కినప్పుడల్లా ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తాను కంపోజ్ చేసిన ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించిన పాటలు పాడుతూ వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నాడు. దీంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు అతని ‘ట్రాఫిక్ సోల్జర్ ఆఫ్ ఇడియా’ అని పిలిచుకుంటున్నారు. తాజాగా ఆదిత్య తివారి ఇండోర్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సైనిక దుస్తులు ధరించి తాను కంపోజ్ చేసిన పాటలు పాడుతూ వాహనదారులకు అవగాహన కల్పించారు. అంతేకాదు.. హెల్మెంట్ ధరించిన వారికి, కారులో సీటు బెల్టు ధరించిన వారికి చాక్లెట్లుసైతం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఏఎన్ఐ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఆదిత్య తివారి చేస్తున్న పనిని మెచ్చుకుంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Also Read : లేడీ బుమ్రాను చూశారా..! బుమ్రా బౌలింగ్ యాక్ష‌న్‌తో అదరగొట్టిన యువతి.. వీడియో వైరల్

ఆధిత్య తివారీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. నేను గత మూడేళ్లుగా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నాను. మా సోదరి ‘నో స్మోకింగ్‘ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఆమెను చూసి నేను కూడా దేశానికి సేవ చేయాలని భావించాను. రోడ్డుపైకి వచ్చి నేను స్వయంగా కంపోజ్ చేసిన పాటలుపాడుతూ ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాను. పరిశుభ్రతలో ఇండోర్ నెంబర్ వన్ అయినట్లే ట్రాఫిక్ రూల్స్ పాటించడంలోనూ ఇండోర్ నెంబర్ వన్ అవ్వాలని కోరుకుంటున్నానని ఆధిత్య తెలిపాడు. నేను పెద్దయ్యాక సైనికుడిగా మారాలనుకుంటున్నానని చెప్పాడు. తివారీ తల్లి సంగీత తివారీ మాట్లాడుతూ.. ఆధిత్య సైనికుడిగా దేశానికి సేవలందించాలని అనుకుంటున్నాడు. అతను సైనికుడిలా దుస్తులు ధరించాడు. పాటలు పాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాడు. ఏడేళ్ల నుంచి ఇలా చేస్తున్నాడు. నేను అతనికి మద్దతుగా ఉంటున్నానని తెలిపింది.

ట్రాఫిక్ పోలీస్ ఎడ్యుకేషన్ వింగ్ సుమంత్ సింగ్ మాట్లాడుతూ.. ఆదిత్య గత మూడు సంవత్సరాలుగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాడని తెలిపాడు. ఆధిత్య సహకారంతో స్థానికంగా ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో చాలామేర విజయవంతం అయ్యాము. మేము అతనికి ‘ట్రాఫిక్ సోల్జర్ ఆఫ్ ఇండియా’ అని పేరు పెట్టామని తెలిపాడు.