తుంగభద్ర డ్యామ్ గేటు ఫిక్స్ ఆపరేషన్ సక్సెస్..

పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1623.32 అడుగులుగా ఉంది.

తుంగభద్ర డ్యామ్ గేటు ఫిక్స్ ఆపరేషన్ సక్సెస్..

Updated On : August 17, 2024 / 9:22 PM IST

Tungabhadra Dam Temporary Crest Gate : తుంగభద్ర డ్యామ్ గేట్లలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతమైంది. క్రస్ట్ గేట్ స్థానంలో ఇంజినీరింగ్ నిపుణుల బృందం స్టాప్ లాక్ గేట్ ను ఏర్పాటు చేశారు. స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటుతో తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు నీటి ప్రవాహం కట్టడైంది. జలాశయ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో గేట్ ఏర్పాటు పనులు జరిగాయి. డ్యామ్ లో నీటి నిల్వ తగ్గే వరకు 19వ గేటును అధికారులు మూసివేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జలాశయం నుంచి 29 గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1623.32 అడుగులుగా ఉంది.

Also Read : ఈ మువ్వన్నెల జెండా చిక్కుముడిని పక్షి నిజంగానే విప్పిందని అనుకుంటున్నారా?