P Susheela : ఆస్పత్రిలో చేరిన ప్రముఖ గాయని పి సుశీల.. ఆందోళనలో ఫ్యాన్స్.. వైద్యులు ఏమన్నారంటే..?
ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురి అయ్యారు

Popular singer P Susheela admitted in Chennai Hospital
singer P Susheela : ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నై మైలాపూర్‌లోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆస్పత్రిలో చేరారు అన్న విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఆమె ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు అని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. ఆమె కడుపునొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. 86 ఏళ్ల సుశీల గత కొంతకాలంగా వయోభారంతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.
Sree Vishnu : హీరో శ్రీవిష్ణు భార్య, కూతురుని చూశారా? భార్య బర్త్ డే రోజు స్పెషల్ ఫోటో షేర్ చేసి..
పి సుశీల పూర్తి పేరు పులపాక సుశీల. తెలుగు, తమిళ, కన్నడ సహా మొత్తం 9 బాషల్లో 40 వేలకు పైగా పాటలు పాటారు. తన మధురమైన గానంతో ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను 2008లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఐదు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలను అందుకుంది.
కాగా.. వయోభారంతో గత కొంతకాలంగా ఆమె పాటలు పాడడం మానేశారు. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.
Chiranjeevi – Ramya : చిరంజీవికి చెల్లెలిగా ఈ హీరోయిన్.. ‘విశ్వంభర’ సీక్రెట్స్ చెప్పేసిన భామ..