విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేశ్.. డీఎస్పీ మురళీకృష్ణ ఏమన్నారో తెలుసా?

మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కూడా వచ్చారు.

విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేశ్.. డీఎస్పీ మురళీకృష్ణ ఏమన్నారో తెలుసా?

Former minister Jogi Ramesh

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో జోగి రమేశ్‌ విచారణకు వచ్చారు.

అలాగే, మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కూడా వచ్చారు. డీఎస్పీ మురళీకృష్ణ ఎదుట జోగి రమేశ్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ఇవాళ విచారణ నిమిత్తం 94 బీఎన్ఎస్ఎస్ కింద జోగి రమేశ్‌ను పిలిపించామని తెలిపారు. తాము జోగి రమేశ్‌ను తమకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా, ఆయన సమాచారం ఇవ్వలేదని చెప్పారు.

అవసరమైతే మళ్లీ పిలిపిస్తామని చెప్పామన్నారు. 94 బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం విచారణలో భాగంగా ఏ వ్యక్తిని అయినా సరే తమకు కావలసిన డాక్యుమెంట్స్ గాని, ఎలక్ట్రానిక్ డివైస్ గాని అడిగే అధికారం ఉందని చెప్పారు. ఆ చట్టం ప్రకారం ఏ వ్యక్తి నుంచి అయినా సమాచారాన్ని రాబట్టుకునే అధికారం పోలీసులకు ఉందని తెలిపారు. కేసు దర్యాప్తు మధ్యలోనే ఉందని, మరింత విచారణ చేయాల్సి ఉందని చెప్పారు.

Also Read: రియాక్టర్‌ పేలి ఆరుగురు కార్మికుల మృతి.. మరో 25 మందికి గాయాలు.. చంద్రబాబు, జగన్ స్పందన