కేసీఆర్ ఆదేశాలు, సూచన మేరకు సింఘ్వీకి రాజ్యసభ సీటు- బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

త్వరలోనే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి. రెండు పార్టీల మధ్య పెళ్లి ఒక్కటే బాకీ ఉంది.

కేసీఆర్ ఆదేశాలు, సూచన మేరకు సింఘ్వీకి రాజ్యసభ సీటు- బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయి అంటే తప్పుడు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విలీనం కాబోతున్నాయని ప్రజలు కన్ ఫర్మ్ చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి సింఘ్వీ కేసీఆర్ కూతురు కవిత కేసు వాదిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాలు, సూచన మేరకు సింఘ్వీకి రాజ్యసభ సీటు ఇచ్చారని చెప్పారు.

”బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ వేయించలేదు. 38 మంది సభ్యులు ఉన్నా బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? పోటీలో ఉంటే బీఆర్ఎస్ కు క్రాస్ ఓటింగ్ అయ్యేది. ఇద్దరూ కలి‌సి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. త్వరలోనే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి. అభిషేక్ మను సింఘ్వీ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి. రెండు పార్టీలు కలిసి డ్రామాలు చేస్తున్నాయి. రెండూ కుటుంబ, అవినీతి పార్టీలే. రెండు పార్టీల మధ్య పెళ్లి ఒక్కటే బాకీ ఉంది. బీఆర్ఎస్ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదో చెప్పాలి.

విగ్రహాల దందా రెండు పార్టీలు బంద్ చేయాలి. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది కూడా రెండు పార్టీల మధ్య ఒప్పందంతో జరుగుతున్న కొట్లాట. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి. ఆయన మనోడు. గజాలలో ఉన్న వారి వద్దకు పోతున్నారు. కానీ ఎకరాల్లో ఉన్న వారి వద్దకు పోవడం లేదు. నీ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేశాడని రేవంత్ రెడ్డిపై కేసు పెట్టావు కదా. ఇప్పుడు ఎందుకు ఆ ఫామ్ హౌస్ నాది కాదు అంటున్నావు. బీజేపీలోకి మంచి నేతలు ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. బీఆర్ఎస్ లో ఎవరైనా మంచి నేతలు ఉన్నారా?” అని నిప్పులు చెరిగారు బండి సంజయ్.

Also Read : ఆ ఫామ్ హౌస్‌ను నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు