భార‌త్ Vs పాక్ : హైదరాబాద్‌లో హై అలర్ట్

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 07:34 AM IST
భార‌త్ Vs పాక్ : హైదరాబాద్‌లో హై అలర్ట్

హైదరాబాద్ : పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్  జరిగిన క్రమంలో  హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఎటాక్ తో దేశ వ్యాప్తంగా పలు సున్నిత ప్రాంతాలపై కేంద్ర గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పాకిస్థాన్ భావిస్తూ అసహనంతో రగిలిపోతోంది. దీంతో ఫిబ్రవరి 26 నుంచి దేశ సరిహద్దు వెంబడి భారత జవాన్లపైకి కాల్పులు జరుపుతోంది.

ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్రం అనుమానిస్తోంది. దీంతో  హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధిక సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నది హైదరాబాద్‌లోనే. డీఆర్‌డీవో ప్రయోగశాలలు, రక్షణోత్పత్తుల పరిశ్రమలు, నగరం చుట్టుపక్కల ఉన్న సైనిక, వాయుసేన శిబిరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు

దేశంలో ఉగ్రవాదులు అనగానే హైదరాబాద్ లో లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్లు..దిల్ సుక్ లాంటి పేలుళ్లు గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో హై అలర్డ్ ప్రకటించిన క్రమంలో హైదరాబాద్ ను టార్గెట్ చేస్తారనే యోచనతో ఈ హై అలర్డ్ ను ప్రకటించారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ లోనే ఉండటం సాధారణంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు భాగ్యనగరాన్నే ఎంచుకునే అవకాశం ఉండొచ్చన్న అనుమానంతో భద్రతను పటిష్టం చేశారు. రక్షణ శాఖకు చెందిన అనేక సంస్థల వద్ద సెక్యూరిటీ భారీగా పెంచారు. 
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్