AB InBev India: అంతర్జాతీయ నీటి దినోత్సవంగా నీటి భద్రతా కార్యక్రమాలను విస్తరించనున్న AB InBev India

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 57% మంది స్పందనదారులు వెల్లడించే దాని ప్రకారం, ఈ ప్రాజెక్టు కార్యక్రమాల వల్ల తమ నీటి భద్రత మెరుగుపడిందన్నారు. నీటి లభ్యత మెరుగుపడటం కారణంగా రబీ, ఖరీఫ్‌ సీజన్‌లలో పంటలను సాగు చేయడం మెరుగుపడిందని గమనించారు. అదనంగా, ఆహార భద్రత కూడా పెరిగిందని 63% లబ్ధిదారులు గమనించగా, నీటి భద్రతా కార్యక్రమాల అమలు తరువాత సరాసరిన 18885 రూపాయలు అదనంగా వార్షిక ఆదాయం సైతం రైతులు పొందగలిగారు.

AB InBev India: అంతర్జాతీయ నీటి దినోత్సవంగా నీటి భద్రతా కార్యక్రమాలను విస్తరించనున్న AB InBev India

AB InBev India to expand water security initiatives on International Water Day

AB InBev India: నీటి పరిరక్షణ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు AB InBev India వెల్లడించింది. ఈ కార్యక్రమాల ద్వారా 2025 నాటికి రెండు రెట్లు అధికంగా నీటి పరిరక్షణ మెరుగుపడనుంది. ఈ విస్తరణ, తమ కార్యకలాపాల వ్యాప్తంగా నిలకడగా నీటి నిర్వహణ ప్రక్రియలను ప్రోత్సహించాలనే కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. నీటి భద్రతా కార్యక్రమాలు ప్రస్తుతం కీలకమైన నీటి ఎద్దడి జిల్లాల్లో AB InBev India అమలు చేస్తోంది. తెలంగాణా, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఉన్నాయి. మూడు ముఖ్యమైన మూల స్ధంభాలు– నీటి పరిరక్షణ, నీటి నాణ్యత, నీటి ప్రాప్యత నేపథ్యంగా నిర్మించిన ఈ కార్యక్రమాల ద్వారా కంపెనీ నీటి వినియోగం తగ్గించడంతో పాటుగా నీటి నాణ్యతను సైతం మెరుగుపరచనుంది. ప్రమాదపుటంచున ఉన్న కమ్యూనిటీలకు పరిశుభ్రమైన తాగునీటిని సైతం అందించనుంది.

TSPSC Paper Leak : గ్రూప్-1 రాసిన 10మంది TSPSC ఉద్యోగులు, రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా

కంపెనీ నీటి పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా, 15 మిలియన్‌ హెచ్‌ఎల్‌ (12.5 మిలియన్‌ కిలోలీటర్లు)కు రీచార్జ్‌ సామర్థ్యం అందుకుంది. ఇప్పుడు దీనిని 2025 నాటికి రెండు రెట్లు వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. ఈ వాటర్‌ సెక్యూరిటీ కార్యక్రమాలలో విస్తృతశ్రేణి కార్యక్రమాలైనటువంటి రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌, వ్యర్ధ జలాల శుద్ధి, రీసైక్లింగ్‌, భూగర్భ జలాల పునర్ధురణ, వాటర్‌షెడ్‌ నిర్వహణ వంటివి ఉన్నాయి. AB InBev India ఇప్పుడు స్థానిక రైతులు, కమ్యూనిటీలతో కలిసి పనిచేయడంతో పాటుగా నిలకడతో కూడిన వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా ప్రోత్సహించడం, నీటి వినియోగం తగ్గించడం, అదే సమయంలో భూసారం పెంచడం లక్ష్యంగా చేసుకుంది. ఈ సందర్భంగా AB InBev India ఇండియా, ఆగ్నేయాసియా ప్రొక్యూర్‌మెంట్‌ – సస్టెయినబిలిటై చీఫ్ అశ్విన్‌ కక్‌ మాట్లాడుతూ ‘‘ మా వ్యాపారాలకు మాత్రమే కాదు కమ్యూనిటీలకు సైతం అత్యంత కీలకమైన వనరు నీరు. మేము కార్యకలాపాలు నిర్వహిస్తోన్న చోట మా వ్యాపారాల వ్యాప్తంగా నీటి పరిరక్షణకు మేము కృషి చేస్తూనే ఉంటుంటాము. మా నీటి పొదుపు కార్యక్రమాలు, భారతదేశపు జాతీయ నీటి పరిరక్షణ లక్ష్యాలకు తోడ్పడటంతో పాటుగా సస్టెయినబల్‌ బిజినెస్‌ ప్రక్రియలలో తమ నాయకత్వ స్థానం సైతం ప్రదర్శిస్తుంది. మన కమ్యూనిటీలు, సరఫరా చైన్‌ వ్యాప్తంగా పెరుగుతున్న నీటి సవాళ్లకు తగిన పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.

Film Writer Veena Pani : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’కి ఘన సన్మానం

AB InBev India పునరుద్ధరించబడిన నిబద్ధతల కారణంగా చెప్పుకోతగ్గ రీతిలో నీటి లభ్యత మెరుగుపడటంతో పాటుగా నాణ్యతను సైతం 2025 నాటికి తమ వాటర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌ల అమలు ద్వారా పెంచనున్నారు. వీటిని స్టేక్‌హోల్డర్లను సమావేశ పరచడం, నిర్ధిష్టమైన స్ధానిక నీటి సవాళ్లను గుర్తించడం, సంభావ్య పరిష్కారాలను మూల్యాంకనం చేయడం, ఆ పై పాలన, ఫైనాన్సింగ్‌ మెకానిజంలతో అంగీకరించిన పరిష్కారాలను అమలు చేయడం ద్వారా పురోగతి, ప్రభావాన్ని కొలవడం చేస్తారు. ఈ వాటర్‌ సెక్యూరిటీ కార్యక్రమం, ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లో ఎన్నో ప్రయోజనాలను అందించింది. ఈ ప్రాజెక్ట్‌ల అమలు 100% లక్ష్యాలను సాధించినట్లుగా కెపీఎంజీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 60% మంది స్పందనదారులు ఈ కార్యక్రమాల అమలు తరువాత తమ జిల్లాల్లో నీటి లభ్యత పెరిగిందని నివేదించారు. అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 70% మంది లబ్ధిదారులు భూగర్భ జలాలు పెరగడంతోపాటుగా వ్యవసాయ అవసరాలకు సైతం నీరు పెరిగిందని, తమ జిల్లాల్లో బోర్‌వెల్స్‌ లోతు పరిశీలించిన తరువాత ఇది మరింత స్పష్టంగా అవగతమైందని వెల్లడించారు.

‘G8’ Chief Ministers: అందుకే జీ8 ముఖ్యమంత్రుల ఫోరాన్ని ఏర్పాటు చేస్తున్నా: కేజ్రీవాల్

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 57% మంది స్పందనదారులు వెల్లడించే దాని ప్రకారం, ఈ ప్రాజెక్టు కార్యక్రమాల వల్ల తమ నీటి భద్రత మెరుగుపడిందన్నారు. నీటి లభ్యత మెరుగుపడటం కారణంగా రబీ, ఖరీఫ్‌ సీజన్‌లలో పంటలను సాగు చేయడం మెరుగుపడిందని గమనించారు. అదనంగా, ఆహార భద్రత కూడా పెరిగిందని 63% లబ్ధిదారులు గమనించగా, నీటి భద్రతా కార్యక్రమాల అమలు తరువాత సరాసరిన 18885 రూపాయలు అదనంగా వార్షిక ఆదాయం సైతం రైతులు పొందగలిగారు. ఇదే సమయంలో రాజస్తాన్‌, తెలంగాణా రాష్ట్రాలలో సాగు చేస్తున్న ప్రాంతం సైతం పెరిగింది. తమ భూములలో నీరు నిల్వలేకపోవడం సైతం వారు గమనించారు. ఇది మరింతగా వ్యవసాయ దిగుబడులు పెంచడంతో పాటుగా రైతుల ఆదాయం సైతం మెరుగుపడింది.