TSPSC Paper Leak : గ్రూప్-1 రాసిన 10మంది TSPSC ఉద్యోగులు, రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా

ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ ల నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై(TSPSC Paper Leak)

TSPSC Paper Leak : గ్రూప్-1 రాసిన 10మంది TSPSC ఉద్యోగులు, రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా

TSPSC Paper Leak : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాఫ్తును ముమ్మరం చేసింది. ఈ కేసులు అరెస్ట్ నిందితులను అన్ని కోణాల్లో సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ ల నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే, రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

గ్రూప్ 1 రాసిన వారిలో కొందరు టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. టీఎస్ పీఎస్ సీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 8మంది ఉద్యోగులు.. ఇలా గ్రూప్ 1 రాసినట్లు గుర్తించిన అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. వారిని విచారిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో 5వ రోజు నిందితులను సిట్ అధికారులు విచారించారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించారు. సైబర్ క్రైమ్ కు చెందిన టెక్నికల్ టీమ్.. మరోసారి సిట్ ఆఫీస్ కి వెళ్లింది. నిందితుడు రాజశేఖర్ ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాఫ్తును వేగవంతం చేసిన సిట్ బృందం.. మరికొన్ని వివరాలను రాబట్టే పనిలో ఉంది. ఓవైపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దర్యాఫ్తు జరుపుతూనే మరోవైపు రాజశేఖర్ స్నేహితుల వివరాలను కూడా సిట్ సేకరించింది. సురేశ్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Also Read..TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

సురేశ్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు తేలింది. దీంతో సిట్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. టీఎస్ పీఎస్ సీలో పని చేస్తున్న 10మంది ఉద్యోగులు (ముగ్గురు ఔట్ సోర్సింగ్) గ్రూప్-1 క్వాలిఫై అయినట్లు సిట్ గుర్తించింది. ఇక రాజశేఖర్ దగ్గరి నుంచి మరింత టెక్నికల్ సమాచారాన్ని సేకరించే పనిలో సైబర్ క్రైమ్ కు చెందిన టెక్నికల్ టీమ్ ఉంది. రేణుకకు నీలేశ్, గోపాల్ ద్వారా రూ.14లక్షలు అందినట్లు సిట్ గుర్తించింది. రాజశేఖర్ సెల్ ఫోన్ చాటింగ్ లో 16మందికిపైగా ముఖ్యంగా ఆరుగురు కరీంనగర్ కు చెందిన వారు. మిగతా వారు రాజశేఖర్ తో పని చేసిన టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులే.

Also Read..Minister KTR : పేపర్ లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్

క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. క్వశ్చన్ పేపర్ల గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త డాక్యా మాట్లాడినట్టు సిట్ భావిస్తోంది. రేణుక కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read..TSPSC Office : టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం