Minister KTR : పేపర్ లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్

రాజశేఖర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తని, రాజశేఖర్ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాలని డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బీజేపీపై తమకు అనుమానం ఉందన్నారు. నోటిఫకేషన్ లపై బండి సంజయ్ ఆరోపణలు చేయటంలో కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు.

Minister KTR : పేపర్ లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్

KTR

Minister KTR : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దుర దృష్టకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు, మంత్రులు, మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణితో చర్చించి సీఎం కేసీఆర్ కు నివేదించామని పేర్కొన్నారు. 155 నోటిఫికేషన్లు, 35 వేల ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం చేశామన్నారు. TSPSCలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనేక మార్పులు తెచ్చామని తెలిపారు. దేశంలో అత్యధిక ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అనేక ఆరోపణలు ఉండేవన్నారు.

ఏడు భాషల్లో ఒకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్పీఎస్సీది అన్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన పనికి వ్యవస్థ కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. రాష్ట్ర యువతలో భరోసా నింపాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల వెనుక ఎవరు ఉన్నా చట్ట పరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇది సిస్టం ఫెయిల్యూర్ కాదని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొత్త సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

పరీక్ష రద్దు అభ్యర్థుల తప్పు కాదని… మళ్ళీ పరీక్షలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో అప్లై చేసుకున్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. కోచింగ్ మెటీరియల్ అంతా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. స్టడీ సర్కిల్స్ 24 గంటలు అందుబాటులో ఉండటంతో పాటు ఉచిత భోజన వసతి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బయట జరుగుతున్న ప్రచారంపై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

యువతను రెచ్చగొట్టే విధంగా కొందరు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ నిరుద్యోగులు, బేహారులు చేసే వ్యాఖ్యలను పట్టించు కోవద్దన్నారు. తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీగా డీజీపీని కలుస్తామని చెప్పారు. రాజశేఖర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తని, రాజశేఖర్ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాలని డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బీజేపీపై తమకు అనుమానం ఉందన్నారు. నోటిఫకేషన్ లపై బండి సంజయ్ ఆరోపణలు చేయటంలో కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు 6 రోజుల పోలీస్ కస్టడీ

ఆరేడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని ఎవరు ఏంటో ప్రజలకు తెలుసన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగ బద్ధ సంస్థని.. ప్రభుత్వ పాత్ర ఉండదని తేల్చి చెప్పారు. ప్రతి దానికి ఐటీ మంత్రిని రాజీనామా చేయాలంటారని.. తనకు ఏం సంబంధం అన్నారు. ఐటీ మినిస్టర్ ఏం పని చేస్తాడో తెలుసా అని అన్నారు. గుజరాత్, అస్సాంలో పేపర్ లీకేజీ అయిందని అక్కడి మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. పరీక్షలో క్వాలిఫై అయిన వారు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు.