TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు 6 రోజుల పోలీస్ కస్టడీ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 9 మంది నిందితులకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు 6 రోజుల పోలీస్ కస్టడీ

TSPSC paper (1)

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 9 మంది నిందితులకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మార్చి23 వరకు నిందితులకు పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా ఆరు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. దీంతో రేపు ఉదయం చర్లపల్లి జైలు నుంచి నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ లీక్‌ కేసుపై టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్‌లో కీలక సూత్రదారి రాజశేఖరే అని సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్‌పై రాజశేఖర్ వచ్చారని తెలిపింది. టెక్నికల్ సర్వీస్‌ నుంచి రాజశేఖర్ డిప్యూటేషన్‌పై వచ్చారని పేర్కొంది. ప్రవీణ్‌తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించారని చెప్పింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా రాజశేఖర్ పనిచేస్తున్నారని వెల్లడించింది.

TSPSC Paper Leak : TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ .. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

రాజశేఖర్ కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని దొంగిలించారని సిట్ అధికారులు పేర్కొన్నారు. పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని శంకర్‌ లక్ష్మి చెబుతున్నారని తెలిపారు. శంకర్‌ లక్ష్మి చెప్పిన దాంతో కంప్యూటర్‌ హ్యాక్‌ చేసినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. రాజశేఖర్ పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేశారని వెల్లడించారు. కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు రాజశేఖర్ ఇచ్చారని తెలిపారు.

ఏఈ పరీక్ష పత్రాన్ని రేణుకకు ప్రవీణ్‌ అమ్మినట్లు చెప్పారు. ఫిబ్రవరి27నే పేపర్‌ను రాజశేఖర్ కాపీ చేశారని తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షాపత్రం లీకైనట్లు సిట్ గుర్తించింది. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ జరిపింది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ గ్రూప్‌-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు సిట్ నిర్ధారణ చేసింది.